పదవీ కాలం ముగిసినా అధికారిక గృహ సముదాయాలు ఖాళీ చేయని మాజీ ఎంపీలపై లోక్‌సభ గృహ కమిటీ చర్యలు చేపట్టింది. అధికారిక గృహాలు ఖాళీ చేయని 27 మంది మాజీ లోక్‌సభ ఎంపీల ఇళ్లకు నీళ్లు,విద్యుత్, గ్యాస్ కనెక్షన్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
భాజపా ఎంపీ సీఆర్ పాటిల్ అధ్యక్షత వహించిన ఈ కమిటీ దిల్లీలోని లుటెన్స్ ప్రాంతంలో సదరు ఎంపీలకు కేటాయించిన గృహాలను ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారం కోరింది. నిబంధనల ప్రకారం పదవీ కాలం ముగిసిన నెలరోజుల వ్యవధిలో ఎంపీలు అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.