తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ 'రేప్​ ఇన్​ ఇండియా' వ్యాఖ్యలపై పెను దుమారం

మేక్​ ఇన్​ ఇండియాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఇరుకునపడ్డారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రేప్​ ఇన్​ ఇండియాగా పేర్కొనటంపై పార్లమెంట్​ ఉభయసభల్లోనూ దుమారం చెలరేగింది. రాహుల్​ గాంధీ క్షమాపణలు చెప్పాలని.. భాజపా మహిళా సభ్యులు ఆందోళనకు దిగారు.

Lok Sabha
రాహుల్​ 'రేప్​ ఇన్​ ఇండియా' వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్​

By

Published : Dec 13, 2019, 11:46 AM IST

Updated : Dec 13, 2019, 2:02 PM IST

రాహుల్​ 'రేప్​ ఇన్​ ఇండియా' వ్యాఖ్యలపై పెను దుమారం

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభల్లో పెను దుమారం రేగింది. మేక్‌ ఇన్‌ ఇండియా కాదు.. రేప్‌ ఇన్‌ ఇండియా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు.

లోక్​సభలో..

ఉదయం 11 గంటలకు లోక్​సభ ప్రారంభం కాగానే.. భాజపా మహిళా సభ్యులు లేచి రాహుల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడియం వద్దకు వచ్చి రాహుల్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారికి పురుష ఎంపీలూ మద్దతు పలికారు. రాహుల్​ గాంధీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్​ చేశారు.

"ఒక పార్టీకి చెందిన నేత.. భారతీయ మహిళలపై అత్యాచారం జరగాలని పిలుపు ఇచ్చారు. ఇలాంటిది జరగటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. గాంధీ పరివారంలోని ఒక వ్యక్తి దేశంలోని మొత్తం మహిళలపై బలత్కారం చేయాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్​ గాంధీ దేశ ప్రజలకు సందేశం ఇస్తున్నారు? రేప్​ ఇన్​ ఇండియా వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలి."

- స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

మహిళా సభ్యుల ఆందోళనతో లోక్​సభలో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఫలితంగా సభను ఓసారి వాయిదా వేశారు స్పీకర్. తిరిగి సమావేశమయ్యాక.... రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ మాట్లాడారు. రాహుల్​ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు సభలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాహుల్​కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగగా... లోక్​సభ మరోసారి వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక... శీతాకాల సమావేశాలు సాగిన తీరును స్పీకర్ ఓం బిర్లా వివరించారు. లోక్​సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు

రాజ్యసభలో..

రాహుల్​ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలోనూ అధికార భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఛైర్మన్​ వెంకయ్యనాయుడు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. రాహుల్​ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్​ నేత క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు వెంకయ్య.

ఝార్ఖండ్​ ప్రచారంలో భాగంగా..

ఝార్ఖండ్​ విధానసభ ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న గొడ్డా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్​ గాంధీ. 'ప్రధాని నరేంద్ర మోదీ మేక్​ ఇన్​ ఇండియా అని చెప్పారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ చూసినా రేప్​ ఇన్​ ఇండియాగా కనిపిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​లో మోదీకి చెందిన ఎమ్మెల్యే ఓ మహిళను అత్యాచారం చేశారు. ఆమె ప్రమాదానికి గురైంది. కానీ మోదీ ఒక్క మాటు కూడా మాట్లాడలేదు' అని విమర్శించారు రాహుల్​.

ఇదీ చూడండి: యూకే ఫలితాలు: బోరిస్ దూకుడు​.. బ్రెగ్జిట్​కే బ్రిటన్​ ఓటు!

Last Updated : Dec 13, 2019, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details