తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విపక్షాల ఆందోళనలతో లోక్​సభ నాలుగుసార్లు వాయిదా - Lok Sabha update

Lok Sabha adjourned
విపక్షాల నిరనసలతో లోక్​సభ వాయిదా

By

Published : Sep 18, 2020, 5:03 PM IST

Updated : Sep 18, 2020, 6:02 PM IST

17:54 September 18

లోక్​సభలో గందరగోళం..

పన్నుచెల్లింపుదారులకు.. పన్ను రిటర్న్​లు, ఆధార్​తో పాన్​ అనుసంధానం గడువు పెంపు వంటి పలు ఉపశమన చర్యలను అమలు చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈ నేపథ్యంలో లోక్​సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అది సభ పలుమార్లు వాయిదా పడేందుకు దారితీసింది.

ఈ బిల్లు మార్చిలో తీసుకొచ్చిన పన్నులు, ఇతర చట్టాలు(నియమాల్లో సడలింపులు, సవరణలు) ఆర్డినెన్స్​ స్థానాన్ని భర్తీ చేయనుంది. ​ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారికి సరైన అవగాహన లేదని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. బిల్లు పూర్తిగా పన్ను రిటర్న్​ల దాఖలు, పన్ను చెల్లింపుల కోసమని.. అది పూర్తిగా కేంద్రం పరిధిలోనిదిగా తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను కేంద్రం తప్పకుండా ఇస్తుందని భరోసా ఇచ్చారు. జీఎస్టీ మండలి నియమాలను కేంద్రం ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. పీఎం కేర్స్​పై సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ మాట్లాడతారని తెలిపారు.

అనంతరం అనురాగ్​ ఠాకూర్​ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రతి విషయంలో తప్పులు వెతికేందుకే ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈవీఎం, ముమ్మారు తలాక్​, జీఎస్​టీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. పీఎం కేర్స్​లో ఎలాంటి తప్పు జరిగిందని ప్రశ్నించారు.

పీఎం నేషనల్​ రిలీఫ్​ ఫండ్​ ట్రస్ట్​ను మాజీ ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ హయాంలో ఏర్పాటు చేస్తే.. ఇప్పటికీ అది పబ్లిక్​ ట్రస్ట్​గా రిజిస్టర్​ కాలేదని, పీఎం రిలీఫ్​ నిధిని కాంగ్రెస్​ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కానీ, పీఎం కేర్స్​ నిధి రాజ్యాంగబద్ధంగా పబ్లిక్​ ఛారిటబుల్​ ట్రస్ట్​గా నమోదు చేసినట్లు చెప్పారు. ఠాకూర్​ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బిల్లును కాంగ్రెస్​ నేతలు అధిర్​ రంజన్​ చౌదరి, శశి థరూర్​, మనీశ్​ తివారీ, టీఎంసీ నేత సౌగత రాయ్​, సీపీఎం నేత ఏఎం అరీఫ్​లు వ్యతిరేకించారు. కాగ్​ ఆడిట్​ నుంచి పీఎం కేర్స్​ను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. విపక్ష నేతల నిరసనలతో సభ నాలుగు సార్లు వాయిదా పడింది.

17:47 September 18

విపక్షాల ఆందోళనలతో లోక్​సభ నాలుగోసారి వాయిదా

విపక్షాల ఆందోళనలతో లోక్​సభ నాలుగోసారి వాయిదా పడింది.

17:36 September 18

'సమస్యలపై దృష్టి మరల్చేందుకే విపక్షాలపై ఆరోపణ'

పీఎం కేర్స్​ నిధిపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి బదులుగా.. ఆరోపణలు చేయటం సరికాదన్నారు కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​. గాంధీ, నెహ్రూలతో పాటు ప్రస్తుత గాంధీ కుటుంబీకులతో సహా ప్రతిఒక్కరిపై మాటల దాడి చేయటాన్ని ఆయన ఖండించారు. దేశాన్ని, పార్లమెంట్​ను వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సమస్యలపై చర్చించటం మోదీ సర్కార్​కు ఇష్టం లేదన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా బిల్లులను ఆమోదించుకోవటంపైనే దృష్టి సారించారని అన్నారు.

17:08 September 18

భాజపా నేతలు చేసిన పలు వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనలు చేసిన క్రమంలో.. లోక్​సభ మూడుసార్లు వాయిదా పడింది. పన్నులు, ఇతర చట్టాలు( నిబంధనల సడలింపు, పలు నియమాల సవరణ) బిల్లు-2020 ప్రవేశపెట్టిన క్రమంలో విపక్షాలు నిరసనలు చేపట్టగాయయ సభలో గందరగోళం నెలకొంది. పీఎం-కేర్స్​ నిధిపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పీఎం కేర్స్​ నిధిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. కాంగ్రెస్​..  పీఎం రిలీఫ్​ ఫండ్​ను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈవీఎంలను వ్యతిరేకించారని, ఆ తరువాత చాలా ఎన్నికలలో ఓడిపోయారని పేర్కొన్నారు. తర్వాత జన్ ధన్, నోట్ల రద్దు, ముమ్మారు తలాక్, జీఎస్టీలపై అసత్య ప్రచారం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో  ఠాకూర్​ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ సభ్యులు నిరసన చేపట్టారు. అనంతరం సభనుంచి వాకౌట్​ చేశారు.  

సభ్యులు నిలబడి మాట్లాడటంపై స్పీకర్​ ఓం బిర్లా హెచ్చరించారు. అలాంటి వారిని సభ నుంచి సస్పెండ్​ చేస్తామన్నారు.  

భాజపా సభ్యుడు లాకెట్​ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్​ కాంగ్రెస్​ నేత కల్యాణ్​ బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు.  

విపక్షాలు చేపట్టిన నిరసనలతో సభ గందరగోళంగా మారటం వల్ల సభను మొదట సాయంత్రం 4.20 గంటల వరకు 30 నిమిషాలపాటు వాయిదా వేశారు ఓం బిర్లా. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ.. విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించటం వల్ల సభను ఆ తర్వాత రెండుసార్లు వాయిదా వేశారు.

16:42 September 18

లోక్​సభ వాయిదా

భాజపా నేతల వ్యాఖ్యలపై విపక్షాల నిరసనలతో.. లోక్​సభ రెండుసార్లు వాయిదా పడింది. 

Last Updated : Sep 18, 2020, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details