తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్​ బ్యాలెట్ల గణనతో ప్రారంభమైన ప్రక్రియ వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపుతో ముగియనుంది. 542 లోక్​సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. అలాగే 4 రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడవుతాయి.

ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు

By

Published : May 23, 2019, 8:00 AM IST

Updated : May 23, 2019, 8:12 AM IST

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్​ బ్యాలెట్ల లెక్కింపు మొదలైంది. అవి పూర్తయ్యాక ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చివర్లో వీవీప్యాట్​ రసీదులతో ఈవీఎంల లెక్కలను సరిపోల్చుతారు. ఒకవేళ రెండింటికీ వ్యత్యాసముంటే వీవీప్యాట్​ రసీదుల లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారు. రసీదుల లెక్క ప్రక్రియ కారణంగా కొన్నిచోట్ల ఫలితాలు 4 నుంచి 5 గంటల ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా జరిగిన 542 లోక్​సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ప్రదేశ్​, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అలాగే తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.

ఏడు దశల్లో ఏప్రిల్​ 11 నుంచి ఈ నెల 19 వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 67.11 శాతం పోలింగ్​​ నమోదైంది. 542 లోక్​సభ స్థానాల్లో 8,049 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తొలిసారిగా వీవీప్యాట్​ స్లిప్పులను ఈవీఎంలలో వచ్చిన ఓట్ల లెక్కతో సరిపోల్చనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరగునుంది.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.

భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్​ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ఇదీ చూడండి : సార్వత్రిక సమరంలో విజయం ఎవరిది?

Last Updated : May 23, 2019, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details