కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ 10,12 తరగతుల బోర్డు పరీక్షలు.. జులై 1 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని సొంతూళ్లకు చేరుకున్న విద్యార్థులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. వారు ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసుకోవచ్చని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రామేశ్ పోక్రియాల్ ప్రకటించారు. పరీక్షల కోసం విద్యార్థులు తాము వచ్చిన ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
'ఎక్కడివారక్కడే ఉండి పరీక్షలు రాసుకోవచ్చు' - సీబీఎస్ఈ పరీక్షలు
లాక్డౌన్తో వాయిదాపడ్డ సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు.. అక్కడి నుంచే పరీక్షలు రాసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు త్వరలోనే సీబీఎస్ఈ ఓ నోటిఫికేషన్ను జారీ చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రమేశ్ పోక్రియాల్.
సొంత జిల్లాలోనే బోర్డు పరీక్షలు రాసుకునేందుకు కేంద్రం అనుమతి
ఈ విద్యార్థుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తుందని పేర్కొన్న మంత్రి.. విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: ఎంసెట్ విద్యార్థులకు వర్గసమీకరణాలపై ఆన్లైన్ పాఠాలు