తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ అంటే అత్యయిక స్థితి కాదు: సుప్రీం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్- 'అత్యవసర పరిస్థితి'కి సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల లాక్​డౌన్​ కొనసాగుతున్నప్పటికీ.. నిర్ణీత సమయంలోపు ఛార్జిషీటు దాఖలు చేయకపోతే.. నిందితులు డిఫాల్ట్​గా బెయిల్ పొందే హక్కు కలిగి ఉంటారని పేర్కొంది.

Lockdown not akin to Emergency, default bail an indefeasible right: SC
లాక్​డౌన్​ - అత్యవసర పరిస్థితికి సమానం కాదు: సుప్రీంకోర్టు

By

Published : Jun 20, 2020, 8:13 PM IST

కరోనా సంక్షోభం వేళ విధించిన లాక్​డౌన్​.. 'అత్యవసర పరిస్థితి'కి సమానం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల లాక్​డౌన్​ కొనసాగుతున్నప్పటికీ.. నిర్ణీత సమయంలోపు ఛార్జిషీటు సమర్పించకపోతే.. నిందితుడు డిఫాల్ట్​గా బెయిల్ పొందే హక్కు కలిగి ఉంటాడని స్పష్టం చేసింది.

చట్టానికి విరుద్ధం

లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ... నిర్ణీత సమయంలోపు ఛార్జిషీటు దాఖలు చేయనప్పటికీ.. మద్రాసు హైకోర్టు నిందితుడికి బెయిల్ నిరాకరించింది.

ఈ అంశాన్ని పరిశీలించిన జస్టిస్ అశోక్​ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... మద్రాస్ హైకోర్టు నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్​ ఎం.ఆర్​.షా, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ కూడా ఉన్నారు.

"మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జ్​ ... భారత ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ను, 'ఎమర్జెన్సీ'కి సమానమని భావించి, తప్పుదోవనపడ్డారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్​ ప్రకారం, మద్రాసు హైకోర్టు నిర్ణయం తప్పు. అది చట్టానికి అనుగుణంగా లేదు."

- జస్టిస్ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. ఎమర్జెన్సీ సమయంలో వెలువడిన 'ఏడీఎం జబల్పూర్ కేసు తీర్పు'ను ప్రస్తావించింది. చట్టబద్ధమైన ప్రక్రియ అనేది లేనప్పుడు... ఒక వ్యక్తి జీవించే హక్కును, స్వేచ్ఛను హరించలేమని స్పష్టం చేసింది.

అందువల్ల సకాలంలో ఛార్జిషీటు దాఖలు చేయకపోతే.. సెక్షన్​ 167 (2) ప్రకారం నిందితుడు డిఫాల్ట్​గా బెయిల్ పొందడానికి అర్హుడవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మద్రాస్​ హైకోర్టుబెయిల్​ నిరాకరించిన నిందితుడికి ఇద్దరు వ్యక్తుల షూరిటీ, రూ.10,000 వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

జబల్పూర్​ తీర్పు

1976లో ఏడీఎం జబల్పూర్ కేసులో.. సుప్రీంకోర్టు 4:1 మెజారిటీతో చారిత్రక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకరం, ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో.. వీటిని హరిస్తే, మిగతా ప్రాథమిక హక్కులను కూడా హరించినట్లేనని పేర్కొంది.

ఇదీ చూడండి:పెళ్లి పేరుతో 34 లక్షలు కొట్టేసిన కేటుగాడు

ABOUT THE AUTHOR

...view details