కరోనా కట్టడికి చేపట్టిన లాక్డౌన్ విజయవంతం చేయటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పలు సందర్భాల్లో వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే చేసి ప్రశంసలు అందుకుంటున్నారు ముంబయి పోలీసులు.
ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ట్విట్టర్ వేదికగా మనసును హత్తుకునే ఓ వీడియో సందేశాన్ని అందించారు. అందులో పెట్రోలింగ్, బందోబస్త్ చేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు. తమకు 21 రోజుల పాటు ఇంటివద్ద ఉండే అవకాశం వస్తే ఏమి చేస్తామో చెబుతూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వీడియోకు 4.77లక్షల వీక్షణలు, 19.2 లక్షల లైకులు, 5,334 రీట్వీట్లు వచ్చాయి. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడాకారుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.