లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చే దిశగా చర్యలు చేపట్టింది కేంద్రం. ఆయా ప్రాంతాల్లో ఉండిపోయిన విద్యార్థులు, వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనుంది. రాష్ట్రాలు, రైల్వే శాఖ సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ ప్రయాణాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రైల్వే శాఖ చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.
పావు శాతం మందిలో..
భారత్లో వ్యాధి నయమయ్యే రేటు 25.37 శాతంగా ఉన్నట్లు అంచనా వేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.27గా ఉన్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1993 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది.
వైద్య ఉపకరణాలపై..
కరోనా నియంత్రణ, నిర్ధరణ, నిర్మూలన దిశగా అవసరమైన వైద్య ఉపకరణాల లభ్యతపై స్పష్టతనిచ్చింది కేంద్రం. "దేశంలో 75,000 వెంటిలేటర్ల అవసరం ఉండగా.. ప్రస్తుతం 19,398 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 60,884 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చాము.