తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో లాక్​డౌన్ లేకపోతే లక్షల్లో కరోనా కేసులు! - covid-19 precautions

దేశంలో 21 రోజుల లాక్​డౌన్​ వల్ల వేల సంఖ్యలో కరోనా కేసుల సంఖ్య తగ్గే అవకాశముందంటున్నారు పరిశోధకులు. ఒకవేళ లాక్​డౌన్​ లేనట్లయితే ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరిగేదని అభిప్రాయపడ్డారు. పునరుత్పత్తి నిష్పత్తి(R0) సూచీతో పాటు పలు అంశాల ఆధారంగా ఉత్తర్​ప్రదేశ్​లోని శివ్​నాడార్​ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ గణాంకాలు వెల్లడించారు.

Lockdown may help flatten COVID-19 curve in India, says study
దేశంలో లాక్​డౌన్ లేకపోతే లక్షల్లో కరోనా కేసులు!

By

Published : Apr 2, 2020, 4:02 PM IST

Updated : Apr 2, 2020, 4:41 PM IST

భారత్​లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టేందుకు 21 రోజుల లాక్​డౌన్​ ఉపయోగపడే అవకాశాలున్నాయంటున్నారు పరిశోధకులు. లాక్​డౌన్​ 20 రోజులకు చేరే సరికి.. కేసుల నమోదులో 83 శాతం తగ్గే సూచనలున్నట్లు ఉత్తర్​ప్రదేశ్​లోని శివ్​నాడార్​ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. దేశంలో లాక్​డౌన్​ లేనట్లయితే ఏప్రిల్​ 13 నాటికి 30,790 వైరస్​ కేసులు, 619 మరణాలు నమోదయ్యే అవకాశాలుండగా.. లాక్​డౌన్​ వల్ల ఆ సంఖ్య 3,500 కేసులు, 105 మరణాలుగానే ఉంటుందని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, కళ్లు, ముక్కును తాకకుండా ఉండటం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్​ ధరించడం వంటి జాగ్రత్తలతో కూడా కరోనా కేసుల సంఖ్యను తగ్గించొచ్చని స్పష్టం చేశారు.

" దేశంలో ఒకవేళ లాక్​డౌన్​ విధించకుంటే.. రాబోయే 10 రోజుల్లో 5వేలు, 20 రోజుల్లో 30,790 కరోనా కేసులు నమోదయ్యేవని మా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 40వ రోజుకు కేసుల సంఖ్య 2,70,360కి చేరేది. మరణాలు 5,407గా నమోదయ్యేవి."

- నాగ సురేష్​ వీరపు, అసిస్టెంట్ ప్రొఫెసర్​, శివ్​నాడార్​ విశ్వవిద్యాలయం

R0 ఆధారంగా..

పునరుత్పత్తి నిష్పత్తి(R0) సూచీ, జన సమూహాల నిషేధం, వైరస్​ లక్షణాలున్న వారిని 14 రోజుల క్వారంటైన్​కు తరలింపు, ఉద్యోగుల వర్క్​ ఫ్రమ్​ హోం, సూపర్​ స్ప్రెడింగ్​ నియమం వంటి వాటి ఆధారంగా ఈ గణాంకాలు లెక్కగట్టారు. లాక్​డౌన్​ 20 రోజులకు చేరే సరికి దేశంలో R0 సూచీ 2.2గా, సూపర్​ స్ప్రెడింగ్ 20/80గా ఉంటుందని వెల్లడించారు.

సాధారణంగా వైరస్​ సోకిన ఒక వ్యక్తి ద్వారా ఎంతమందికి వైరస్​ వ్యాప్తి చెందుతుందని తెలిపే ఓ ప్రామాణిక సూచీయే పునరుత్పత్తి నిష్పత్తి(R0). ఉదాహరణకు R0 సూచీ 1.3-2 వరకు ఉంటే.. వైరస్ సోకిన వ్యక్తి.. ఒకరి నుంచి ఇద్దరికి వ్యాప్తి చేయగలడని అర్థం. అలాగే సూపర్​ స్ప్రెడింగ్​ 20/80 రూల్​ అంటే... నమోదైన మొత్తం కేసుల్లో 20 శాతం మంది 80 శాతం వైరస్​ వ్యాప్తికి సహకరించారని అర్థం.

మార్చి 24న లాక్​డౌన్

దేశంలో కరోనా కారణంగా ఇప్పటికే 1,965 కేసులు నమోదవగా, 50 మంది మహమ్మారికి బలయ్యారు. వైరస్​ వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 24 నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్​డౌన్​ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏప్రిల్​ 14న ఈ లాక్​డౌన్​ ముగుస్తుంది.

Last Updated : Apr 2, 2020, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details