తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు- మార్గదర్శకాలు జారీ - LOCKDOWN EXTENSION

LOCKDOWN EXTENSION
దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

By

Published : May 17, 2020, 6:17 PM IST

Updated : May 17, 2020, 8:06 PM IST

20:05 May 17

దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి పలు సడలింపులు ఇస్తూనే లాక్​డౌన్​ కొనసాగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది.

లాక్‌డౌన్‌ 4.0 గైడ్‌ లైన్స్‌ ఇవే...

అనుమతి లేనివి..

  • సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్, హోటళ్లు మూసి ఉంటాయి.
  • మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు బంద్‌.
  • దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్.
  • స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, వినోద రెస్టారెంట్లు, ఆడిటోరియాలు
  • పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే సభలకు అనుమతి లేదు.
  • కంటైన్‌మెంట్‌ జోన్లలో బస్సు సర్వీసులకు అనుమతి లేదు.
  • 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణీలు ఇంటికే పరిమితం కావాలి

అనుమతి ఉన్నవి...

  • దేశీయంగా మెడికల్​ సేవలు, ఎయిర్​ అంబులెన్స్​లు, భద్రతకు సంబంధించిన వాహనాలకు అనుమతి.
  • ప్రేక్షకులు లేకుండా క్రీడా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి.
  • వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యటకులకు వసతి కల్పించే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి ఉంటుంది.
  • రెస్టారెంట్లు ఆహార పదార్థాలను హోమ్‌ డెలివరీ చేసేందుకు అనుమతి.
  • బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోని క్యాంటిన్లు నడిపేందుకు అనుమతి.
  • రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి.
  • షరతులు లేకుండా వైద్య సిబ్బంది అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలి

కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు

  • ఎక్కడెక్కడ రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది.
  • రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
  • కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.
  • కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.

రాత్రి కర్ఫ్యూ

రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు చేయాలి.

19:29 May 17

  • 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణీలు ఇంటికే పరిమితం కావాలి
  • షరతులు లేకుండా వైద్య సిబ్బంది అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలి
  • అంతర్రాష్ట్ర సరకు రవాణాకు అన్ని రాష్ట్రాలు, యూటీలు అనుమతి ఇవ్వాలి

19:18 May 17

  • రెస్టారెంట్లు ఆహార పదార్థాలను హోమ్‌ డెలివరీ చేసేందుకు అనుమతి
  • కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి: హోంశాఖ
  • రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి

19:08 May 17

  • స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, వినోద రెస్టారెంట్లు మే 31 వరకు బంద్‌
  • ప్రేక్షకులు లేకుండా క్రీడా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి

19:04 May 17

  • సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్, విమాన సర్వీసులు బంద్‌
  • మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్‌
  • దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్

19:01 May 17

  • దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు: కేంద్ర హోంశాఖ
  • లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన హోంశాఖ

18:43 May 17

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించారు. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్​డీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్​డౌన్​ మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించనుంది. ఇటీవల జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించినప్పుడు లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని ప్రకటన చేశారు.

నాలుగో విడత లాక్‌డౌన్‌లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. కరోనా కేసులు అదుపులోకి రాకపోవడం వల్ల తొలుత పంజాబ్​, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తూ ఇప్పటికే ప్రకటించాయి.

సమావేశం...

రాష్టాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు.. ఈరోజు రాత్రి 9 గంటలకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు కేంద్ర కేబినెట్​ సెక్రటరీ రాజీవ్​ గౌబా. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పలు అంశాలపై చర్చించనున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం...  భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90,927కు చేరింది. మహమ్మారికి 2,872 బలవగా..34,109 మంది కోలుకున్నారు.

18:26 May 17

దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆర్థిక వ్యవహారాల పునరుద్ధరణ నిబంధనలను హోంశాఖ ఇస్తుందని తెలిపింది.లాక్‌డౌన్‌ నిబంధనల మార్పుచేర్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్రలో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

18:02 May 17

దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

  • దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
  • లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఉత్తర్వులు విడుదల చేసిన ఎన్‌డీఎంఏ
Last Updated : May 17, 2020, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details