దేశవ్యాప్త లాక్‌డౌన్ ఆంక్షల్లో మే 3 తర్వాత మార్పులు రానున్నాయి. రెడ్ జోన్లలో పూర్తిగా, మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా వాటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణలో మే 7 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉంటుంది.
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఉండే కార్యాలయాలు, దుకాణాలు, పరిశ్రమలను అనుమతించడంతో పాటు.. ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడిన ఇతర పనులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం..
- రెడ్ జోన్లలో ఇప్పటి మాదిరిగానే అన్ని కార్యకలాపాలు పూర్తిగా నిలిపేస్తారు.
- మిగతా చోట్లా పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన స్థలాల మూసివేత కొనసాగుతుంది.
- మత, రాజకీయ, క్రీడా కార్యకలాపాలపైనా నిషేధం ఉంటుంది.
- బస్సులు, రైళ్లు, విమానాలరాకపోకలు ఉండవు.
- మిగతా ఆర్థిక వ్యవహారాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి అనుమతించనున్నారు.
- ప్రజలు తాము పనిచేసే చోటుకు వ్యక్తిగత వాహనాలపై వెళ్లి రావడానికి వీలు కల్పించనున్నారు. సంస్థలు ఏర్పాటుచేసే వాహనాల్లో సామాజిక దూరం పాటిస్తూ రాకపోకలు సాగించడానికీ అవకాశం ఇవ్వనున్నారు.
కేబినెట్‌లో భేటీ తర్వాత..