కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేద-ధనిక అనే భేదం లేకుడా ఈ లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే లాక్డౌన్ వల్ల తన ముగ్గురు భార్యలను, 12మంది పిల్లలను పోషించలేకపోతున్నానని వాపోతున్నాడు ఓ బిహార్ వాసి.
మూడు పెళ్లిల్లు...
బిహార్లోని అర్వాల్ జిల్లాకు చెందిన మహ్మద్ హుసేన్.. ఓ రోజువారీ కూలీ. అతడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 12 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అందరూ కలిసే ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూనే వారిని పోషించేవాడు మహ్మద్.
కానీ లాక్డౌన్ వల్ల హుసేన్ ఉపాధి కోల్పోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు భోజనం కరవైంది. ప్రభుత్వ నుంచి కూడా సహాయం అందట్లేని చెబుతోంది హుసేన్ భార్య.