భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలకు మామూలుగానే ప్రజాదరణ ఎక్కువ. కానీ, ఈ నెల 24న ఆయన చేసిన దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన మాత్రం టీవీ రేటింగుల్లోనే చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకూ రాని రేటింగ్ ఆ ప్రసంగానికి వచ్చిందని బ్రాడ్‌కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ప్రకటించింది.
కరోనాను మట్టిగరిపించేందుకు సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని నిర్దేశిస్తూ... 21 రోజులు లాక్డౌన్ ప్రకటించారు మోదీ. దాదాపు 19.7 కోట్ల మంది టీవీలో ఆయన ప్రసంగాన్ని తిలకించారు.
"బార్క్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. టీవీలో ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భారత్ లాక్డౌన్ ప్రకటన అత్యధిక వీక్షకులను సొంతం చేసుకుంది. 201 ఛానళ్లకుపైగా ఈ ప్రసంగాన్ని ప్రసారం చేశాయి. ఐపీఎల్ మ్యాచ్‌కు సైతం దక్కని ఆదరణ మోదీ లాక్డౌన్ ప్రకటనకు దక్కింది."