దేశంలో లాక్డౌన్ 4.0 ఈ నెల 31తో తీరిపోనుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవటం వల్ల జూన్ 1 నుంచి లాక్డౌన్ 5.0 తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తారని తెలుస్తోంది.
70 శాతం కేసులు..

దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 నగరాలకే లాక్డౌన్ 5.0 అమలు చేయనున్నట్లు సమాచారం. దిల్లీ, ముంబయి, పుణె, ఠాణె, సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, ఇండోర్, చెన్నై, జైపుర్, కోల్కతా నగరాల్లో ఆంక్షలు కొనసాగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగిలిన చోట్ల అనేక సడలింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
దేశం మొత్తం నమోదైన కేసుల్లో ఈ 11 నగరాల్లోనే 70 శాతం ఉన్నాయి.
ఇదీ చూడండి:దేశంలో తగ్గుతోన్న కరోనా సంక్రమణ వేగం!