తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ 3.0లో ఏం చేయొచ్చు? ఏం చేయరాదు?

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా పటిష్ఠ లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఇప్పటికే తొలుత 21 రోజులు, రెండో దఫాలో మళ్లీ 19 రోజులు.. యావత్​ భారతదేశం ఒక్కటై ముందుకెళ్లింది. కఠిన నిబంధనలు, స్వల్ప సడలింపులతో 40 రోజులు గడిచినా కొవిడ్​ మాత్రం వదలట్లేదు. అందుకే 'లాక్​డౌన్​ 3.0.' అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రం. మే 4 నుంచి అమల్లోకి రానున్న 3.0. మార్గదర్శకాల్లో కేంద్రం ఏం సడలింపులు ఇచ్చింది? ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఎలాంటి చర్యలకు పూనుకుంది? వేటికి అనుమతి ఉంది? ఏఏ కార్యకలాపాలు సాగనున్నాయో తెలుసుకున్నారా?

Lockdown 3.0: Guidelines for red, orange and green zones
'కీ'లక అంకానికి లాక్​డౌన్​- 3.O.కు రె'ఢీ'నా!

By

Published : May 3, 2020, 12:38 PM IST

Updated : May 3, 2020, 2:53 PM IST

గతేడాది డిసెంబర్​లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్​.. ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టించింది. తొలుత చైనా, దక్షిణ కొరియాలను భయపెట్టి.. ఆపై ఐరోపా దేశాలను చుట్టుముట్టింది. ఇప్పుడు అమెరికా దేశాలను అతలాకుతలం చేస్తోంది. జనజీవనం అస్తవ్యస్తమై... బతుకు చక్రాలకు బ్రేకులుపడ్డాయి. కార్యకలాపాల్లేక ఆదాయానికి గండిపడింది. ఆర్థిక వ్యవస్థలే పతనమయ్యాయి.

భారత్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్నా.. ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యమిస్తూ 40 రోజుల సుదీర్ఘ లాక్​డౌన్​ను అమలు చేసింది. కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ మోదీ సర్కార్...​ వైరస్​ వ్యాప్తిని మితిమీరకుండా చేస్తూ వస్తోంది. అయినా.. కేసులు, మరణాలు తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి లాక్​డౌన్​ను పొడిగించింది. అయితే.. ఈ సారి ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే.. కరోనాను తరిమికొట్టేందుకు పూనుకున్న కేంద్రం మార్గదర్శకాల్లో సడలింపులు ఇచ్చింది.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా వైరస్​ తీవ్రతను బట్టి జిల్లాలను రెడ్​, ఆరెంజ్​, గ్రీన్​ జోన్లుగా విభజించింది కేంద్రం.

  • కేసులు లేని లేదా 21 రోజులుగా కొత్త కేసులు నమోదుకాని జిల్లాలను గ్రీన్​జోన్లుగా పిలుస్తారు.
  • కరోనా తీవ్రత, రెట్టింపు రేటు, నివారణ చర్యల ఆధారంగా.. రెడ్​ జోన్లు లేదా హాట్​స్పాట్​ జిల్లాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది.
  • రెడ్​, గ్రీన్​ జోన్లుగా కాకుండా ఉన్నవాటిని ఆరెంజ్​ జోన్లుగా పరిగణిస్తారు.

రెడ్​ జోన్​గా ఉన్న జిల్లాలో వరుసగా 21 రోజులపాటు కేసుల్లేకుంటే ఆ ప్రాంతం ఆరెంజ్​ జోన్​గా మార్చుతారు. ఆరెంజ్​ జోన్​గా ఉన్న జిల్లాలోనూ వరుసగా 21 రోజులు కొత్త కేసుల్లేకుంటే గ్రీన్​ జోన్​గా పరిగణిస్తారు.

వారానికోసారి జోన్ల జాబితాలో మార్పులు చేస్తుంటుంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్​ జోన్లలో నిబంధనలు అలాగే యథాతథంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇతర నిబంధనలను కఠినంగా అమలు చేయడం సహా ప్రజలు ఆరోగ్య సేతు యాప్​ను తప్పనిసరిగా వినియోగించేలా చూసే బాధ్యత స్థానిక యంత్రాంగానిదే.

జోన్లతో సంబంధం లేకుండా.. వచ్చే రెండు వారాలు ఈ కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది.

లాక్​డౌన్​లో వీటిపై నిషేధం
రెడ్​జోన్లలో ఏమేం చేయొచ్చు..?
ఆరెంజ్​ జోన్లలో స్వల్ప సడలింపులు
దేశవ్యాప్తంగా గ్రీన్​జోన్లకు ఊరట
Last Updated : May 3, 2020, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details