దేశంలో కరోనా నియంత్రణ దిశగా లాక్డౌన్ 3.0 అమలులోకి వచ్చింది. అయితే ఆయా ప్రాంతాలను పలు జోన్లుగా విభజించిన సర్కారు.. ఆ మేరకు పలు సడలింపులు అమలు చేస్తోంది. అయితే కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. లాక్డౌన్ 3.0 ఇవాళ్టి నుంచి మే 17వరకు కొనసాగనుంది.
ఈ సేవలు బంద్..
జోన్లు, ప్రభావిత ప్రాంతాలు అనే భేదం లేకుండా విమానాలు, రైల్వే, మెట్రో, రహదారి మార్గం ద్వారా అంతరాష్ట్ర ప్రయాణాలు నిలిచిపోతాయి. విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, హోటళ్ల మూసివేత కొనసాగుతుంది. సినిమా హాళ్లు, మాల్లు, క్రీడా ప్రాంగణాలు, రాజకీయ, సామాజిక సమావేశాలపై నిషేధం యథావిధిగా ఉంటుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాలు మినహా.. ఇతర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో క్షౌరశాలలకు అవకాశం..
గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని క్షౌరశాలలు, స్పాలు తెరిచేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ- కామర్స్ సంస్థల ద్వారా కొనుగోళ్లకు అవకాశం ఇచ్చింది.
'సరుకు' అందుబాటులో..
కంటెయిన్మెంట్ ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్లా మద్యం అందుబాటులో ఉంటుంది. అయితే మార్కెట్ ప్రాంతాల్లో అమ్మకాలకు అవకాశం కల్పించలేదు. ఒక్కటిగా ఉన్న దుకాణాల్లో మాత్రమే అమ్మవచ్చని స్పష్టత ఇచ్చింది కేంద్రం. కరోనా నియంత్రణ దిశగా జాగ్రత్త చర్యలు చేపట్టి కొనుగోళ్లు చేయాలి.
వారికి అవకాశం లేదు..
అన్ని జోన్లలోని అనారోగ్యంగా ఉన్న వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నపిల్లలకు బయట తిరగకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విమానం, రైలు, రహదారి మార్గం ద్వారా ప్రయాణాలకు అనుమతి ఇస్తారు. కంటెయిన్మెంట్ ప్రాంతాల్లోని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు.
అన్ని జోన్లలోని వారు చేసేందుకు అనుమతించిన కార్యకలాపాలు ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగం, క్లినిక్లకు అన్ని జోన్లలో నడపవచ్చు. అయితే భౌతిక దూరం పాటిస్తూ ఈ సేవలను వినియోగించుకోవాలి. అయితే కంటెయిన్మెంట్ జోన్లలో ఇందుకు అవకాశం లేదు.
సరుకు రవాణాకు అన్ని ప్రాంతాల్లో అనుమతులు. దేశాల మధ్య ఎగుమతి, దిగుమతులు కొనసాగుతాయి.
రెడ్ జోన్లలో