తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్​డౌన్​ పొడిగింపు - దేశంలో లాక్​డౌన్​ పొడిగింపు

Lock down extended by two weeks in India
మరో 2 వారాలు లాక్​డౌన్​

By

Published : May 1, 2020, 5:53 PM IST

Updated : May 1, 2020, 8:33 PM IST

18:41 May 01

మరో 2 వారాలు లాక్​డౌన్​

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మే 4నుంచి రెండు వారాలు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటికే విధించిన లాక్​డౌన్​ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఈనెల 17వరకు లాక్​డౌన్​ ఆంక్షలు కొనసాగనున్నాయి.

జోన్లవారీగా మార్గదర్శకాలు

అలాగే జోన్లవారీగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది హోంశాఖ.  గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో నిబంధనల మేరకు కొన్ని సడలింపులు చేసింది. ఏప్రిల్‌ 30న ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల గుర్తింపు చేయాలని సూచించింది. వరుసగా 21 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాని జిల్లాలు గ్రీన్‌ జోన్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది.  

18:25 May 01

దేశవ్యాప్తంగా మరో 2 వారాలు లాక్​డౌన్​ పొడిగింపు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.

17:47 May 01

దేశంలో కరోనా విజృంభణ- 24 గంటల్లో 77మంది మృతి

దేశంలో కరోనా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 77మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1755 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా కొవిడ్​-19 వివరాలు ఇలా ఉన్నాయి..

  • మొత్తం బాధితులు -35,365
  • మృతులు -1152
  • యాక్టివ్ కేసులు -25,148
  • కోలుకున్నవారు -9064
Last Updated : May 1, 2020, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details