కరోనా లాక్డౌన్ కారణంగా అనేక కార్యక్రమాలు, మరెన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అయితే కర్ణాటకలో ఓ జంట ఆన్లైన్ వివాహం చేసుకుని అందరినీ అబ్బురపరిచింది. స్కైప్‌లో వీడియో కాల్ ద్వారా తమ సంప్రదాయాలు ప్రకారం ఒక్కటైంది ఆ కొత్త జంట.
ఇదీ జరిగింది.

కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన ఇమ్రాన్, కొప్పాల్ జిల్లాకు చెందిన తాజ్మా బేగంకు ఈ రోజు(21-04-2020)న వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. అయితే కరోనా కారణంగా దేశంలో లాక్డౌన్ అమల్లో ఉంది. పెళ్లి వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు పెళ్లి పెద్దలు. తమ సంప్రదాయం ప్రకారం ఆన్లైన్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే.. స్కైప్‌లో వీడియో కాల్ చేసి అటువైపు వధువు తల్లిదండ్రులు, బంధువులు.. ఇటువైపు వరుడు అమ్మనాన్నలు, మతపెద్దల సమక్షంలో పెళ్లి తంతు పూర్తి చేశారు.
లాక్డౌన్ ఎత్తవేసిన తర్వాత తమ కోడల్ని ఇంటికి తీసుకొస్తామని చెప్పారు వరుడు కుటుంబ సభ్యులు.
ఇదీ చూడండి:కన్నబిడ్డను విడిచి ఒకరు.. కడుపులో బిడ్డతో మరొకరు!