తెలంగాణ

telangana

కరోనా సడలింపులపై పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

By

Published : May 26, 2020, 12:20 PM IST

Updated : May 26, 2020, 12:59 PM IST

Locals in Rourkela scuffle with police while staging agitation demanding lifting of COVID19 containment zones, western range DIG of police & SP on spot

odisha rurkela
కరోనా సడలింపులపై పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

12:39 May 26

పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ

ఒడిశా రూర్కెలాలో పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. కంటైన్​మెంట్​ జోన్ ఎత్తేసే అంశమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతించని నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ట్రక్కుల్లో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.  

ఇదీ జరిగింది..

గత నెలలో రూర్కెలాలో తొలి వైరస్ కేసు నమోదైంది. అనంతరం పలువురికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో వైరస్ నివారణ చర్యల్లో భాగంగా.. ప్రాంతాలను కంటైన్​మెంట్, బఫర్​ జోన్లుగా ప్రకటించారు అధికారులు. కరోనా ఉద్ధృతి తగ్గిన కారణంగా ఇటీవల బఫర్​ జోన్లలో ఆంక్షలను సడలించారు. అయితే కంటైన్​మెంట్​ జోన్లలో ఆంక్షలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయమే అక్కడ ఘర్షణకు కారణమైంది. తమ ప్రాంతాల్లోనూ సడలింపులు అమలు చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు లక్ష్యంగా రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకుని ట్రక్కుల్లో తరలించారు.  

12:07 May 26

ఒడిశా రూర్కెలాలో పోలీసులు, కంటెయిన్​మెంట్​ జోన్​లోని ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. వైరస్ ప్రభావం లేని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం సడలింపులు అమలు చేసింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాలకూ ఈ నిర్ణయం వర్తింపజేయాలని కంటైన్​మెంట్​ జోన్ పరిధిలోని ప్రజలు నిరసనకు దిగారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైకి ఎదురుదాడికి దిగారు స్థానికులు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్రక్కుల్లో తరలించారు .

Last Updated : May 26, 2020, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details