తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల్లో 'ఎల్​జేపీ' అడుగు ఎటువైపు? - Bihar assembly polls

బిహార్​ ఎన్నికల్లో లోక్​ జనశక్తి పార్టీ ఎటువైపు అడుగువేయనుంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు కూటమిలోని జేడీయూపై తమ అభ్యర్థులను పోటీలో ఉంచటమా? లేదా.. కూటమితోనే సీట్లు పంచుకోవటమా? ఈ అంశంపై సోమవారం జరిగే ఎల్​జేపీ సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది.

LJP meet on Monday
బిహార్​ ఎన్నికల్లో 'ఎల్​జేపీ' అడుగు ఎటు వైపు?

By

Published : Sep 7, 2020, 9:51 AM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించేందుకు నేడు సమావేశం కానుంది లోక్​ జనశక్తి పార్టీ (ఎల్​జేపీ). ఎన్డీఏ కూటమిలోని జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలో దించాలా లేదా.., కూటమితోనే కొనసాగాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కూటమిలో లుకలుకలు..

ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న మాజీ సీఎం జీతన్​రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్​ మోర్చా.. జేడీయూతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. దీనిని లోక్​ ​జనశక్తి పార్టీ (ఎల్​జేపీ) వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచే జేడీయూతో అంటీముట్టనట్లు ఉండే ఆ పార్టీ ఇప్పడు ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సోమవారం జరగనున్న భేటీలో స్పష్టత రానుంది.

2005 వ్యూహంతోనేనా..

కొద్ది రోజులుగా సీఎం నితీశ్​ కుమార్​ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు ఎల్​​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​. కానీ, భాజపా, ప్రధాని మోదీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంలోనే ఉంటూ రాష్ట్రంలో జేడీయూకు వ్యతిరేకంగా తమ అభ్యర్థులను బరిలో దించాలని యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇందుకు 2005 ఎన్నికల్లో ఎల్​​జేపీ అవలంబించిన తీరును పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ భాగస్వామ్యంలోనే ఉంటూ రాష్ట్రంలో ఆర్​జేడీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. అది రాష్ట్రంలో హంగ్​కు దారితీసింది. దాంతో లాలూ ప్రసాద్​ పార్టీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది.

కలిసే పోటీ..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కూటమిలోని మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు సీనియర్​ నేతలు వెల్లడించారు.

నితీశ్​ తీరుపై అసంతృప్తితోనే..

ఆర్జేడీ నుంచి నాయకులను ఆకర్షించటం, మాంఝీతో జతకట్టటం ద్వారా తన స్థానాన్ని సీఎం నితీశ్​​ బలోపేతం చేసుకునేందుకు కృషి చేయటం ఎల్​జేపీ నేతలు అసౌకర్యంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీట్ల పంపకంపై ఎల్​జేపీతో ఎలాంటి చర్చలు చేపట్టలేదని జేడీయూ వెల్లడించటం కూడా పాసవాన్​ పార్టీ బయట నుంచి పోటీ చేసే అవకాశాలను బలపరుస్తోంది.

ఇదీ చూడండి: మాంఝీ ఎంట్రీ.. ఎన్డీఏలో లుకలుకలు!

ABOUT THE AUTHOR

...view details