ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ట్విట్టర్లో సందేశం ఇచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రకృతితో అందరూ మమేకం కావాలని సూచించారు. కేదార్నాథ్లో పర్యటించిన కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. భూమిని స్వచ్ఛంగా మార్చాలని కోరారు.
"మనల్ని ఎల్లవేళలా కాపాడేది భూమి, పర్యావరణమే. ఈ రోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. స్వచ్ఛమైన ప్రకృతి కోసం మనం నిబద్ధతను చాటాలి. ప్రకృతితో స్నేహంగా మిలిగితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. మొక్కలను నాటడమే కాదు.. అవి చెట్లుగా పెరిగే వరకూ సంరక్షించాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి