తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభను గురువారానికి వాయిదా వేసిన సభాపతి

parliament budget session 2021
పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు

By

Published : Feb 3, 2021, 9:09 AM IST

Updated : Feb 3, 2021, 10:19 PM IST

21:36 February 03

గురువారానికి వాయిదా..

వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుబడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలతో లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే, కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధీర్‌ రంజన్‌ ఛౌదరి రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నారు. ఇంతలో.. పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెనక్కు వెళ్లాలని స్పీకర్‌ ఓంబిర్లా పదే పదే సూచించినా... సభ్యులు నిరసనలు కొనసాగించారు. 

దీంతో సభ 4.30 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి బడ్జెట్‌ ప్రసంగం, రైతుల అంశంపై ప్రత్యేకంగా చర్చ జరపాలని అధీర్‌ రంజన్‌ చౌదరి డిమాండ్ చేశారు. సభ్యులు మళ్లీ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. వీరిలో కాంగ్రెస్‌, ఆప్‌, డీఎంకే, శిరోమణి అకాలీ దళ్‌ సభ్యులు ఉన్నారు. దీంతో సభ సాయంత్రం 5 గంటలకు..  ఆ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు వాయిదా పడింది. ఏడు గంటలకు సమావేశం ప్రారంభమైనప్పటికీ.. ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించగా.. రాత్రి 9 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఆందోళనలు ఆగకపోవడం వల్ల సభాపతి సభను గురువారానికి వాయిదా వేశారు.  

19:07 February 03

రాత్రి 9గంటలకు వాయిదా

విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను సభాపతి మరోసారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను స్పీకర్​ రాత్రి 9గంటలకు వాయిదా వేశారు.

17:12 February 03

సభ తిరిగి ప్రారంభమయ్యాక విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించారు.  సభ మధ్యలోకి వెళ్లి విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. దీంతో సభ మూడోసారి వాయిదా పడింది. 7 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.

16:38 February 03

సాగు చట్టాలకు వ్యతిరేకంగా లోకసభలో విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభ మధ్యలోకి వెళ్లి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. తమ స్థానాల్లో కూర్చోవాలని సభాపతి విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మరోసారి 5గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.

16:06 February 03

లోక్​సభ సమావేశం ప్రారంభమైన వెంటనే సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై చర్చిందేకు సిద్ధమని స్పీకర్​ చెప్పినా ఆందోళనలు విరమించుకోలేదు. దీంతో సభను 4:30 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.

14:09 February 03

రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. 

అంతకుముందు... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. విపక్ష సభ్యులు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

11:02 February 03

సాగు చట్టాలపై చర్చకు సమయం కేటాయించినప్పటికీ సభలో ఆందోళనలు చేసిన ముగ్గురు ఆప్ ఎంపీలపై ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు. వ్యవసాయ చట్టాలపై అసమ్మతి తెలియజేసినందుకు ఛైర్మన్​ తమను బయటకు పంపారని ఆప్​ ఎంపీలు అన్నారు.

09:48 February 03

వాయిదా అనంతరం రాజ్యసభ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సస్పెన్షన్​కు గురైన ఆప్​ ఎంపీలు సభలోనే ఉండి నినాదాలు చేస్తున్నారు. 

09:40 February 03

రాజ్యసభలో  సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన ముగ్గురు ఆప్​ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.

09:35 February 03

సాగు చట్టాలపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. రైతు సమస్యలపై తక్షణమే చర్చించాలని డిమాండ్​ చేశాయి. దీంతో సభను కాసేపు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

09:31 February 03

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మరింత సమయం కేటాయించాలని కేంద్రం, విపక్షాలకు మధ్య రాజ్యసభలో ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సమయంలో రైతు ఆందోళనకు చర్చించేందుకు ఇరువురు అంగీకరించారు.

09:23 February 03

రాజ్యసభలో మొబైల్​ ఫోన్ల వాడకంపై పరిమితులు ఉన్నాయని సభ్యులకు తెలిపారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. కొందరు సభ్యుల సభా కార్యక్రమాలను రికార్డు  చేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి ప్రవర్తన పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని సభ్యులకు చెప్పారు. అలాంటి అనవసర కార్యకలాపాలకు సభ్యులు దూరంగా ఉండాలని సూచించారు. సభలో అనధికారిక రికార్డులు సామాజిక మాధ్యమాల్లో ప్రాసరమైతే సభా హక్కులను ఉల్లంఘించనిట్లే అవతుందని హెచ్చరించారు.

09:01 February 03

వెనక్కి తగ్గని విపక్షాలు- లోకసభ వాయిదా

రాజ్యసభ కార్యకలాపాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్​, డీఎంకే జోరో అవర్​ నోటీసులిచ్చాయి.

Last Updated : Feb 3, 2021, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details