తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా లైవ్​: రేపు మధ్యాహ్నం ఖట్టర్​ ప్రమాణస్వీకారం - హరియాణా ఎన్నికల ఫలితాలు

మరికాసేపట్లో భాజపా శాసనసభాపక్ష సమావేశం

By

Published : Oct 26, 2019, 11:02 AM IST

Updated : Oct 26, 2019, 3:50 PM IST

15:23 October 26

రేపే ముహూర్తం...

హరియాణా ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు ఖట్టర్​. ప్రభుత్వం ఏర్పాటుకు తమని ఆహ్వానించాలన్న అభ్యర్థనను గవర్నర్​ అంగీకరించినట్టు తెలిపారు ఖట్టర్​.

14:50 October 26

ఖట్టర్​ వినతి

గవర్నర్​తో ఖట్టర్​ భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. ఖట్టర్​తో పాటు జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా, కేంద్రమంత్రి రవిశంకర్​ ఉన్నారు.

14:29 October 26

గవర్నర్​ నివాసానికి...

హరియాణా ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న ఖట్టర్​... గవర్నర్​ నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని గవర్నర్​ను కోరనున్నారు. ఖట్టర్​తో పాటు కేంద్రమంత్రి రవిశంకర్​, జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా ఉన్నారు. 

12:57 October 26

ముఖ్యమంత్రిగా రేపే ప్రమాణస్వీకారం...

హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్​ లాల్​ ఖట్టర్​ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. హరియాణా సీఎంగా ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

12:43 October 26

గవర్నర్​ దగ్గరకు...

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించమని కోరేందుకు భాజపా నేతలు గవర్నర్​ దగ్గరకు వెళ్లనున్నారు. ఇప్పటికే  భాజపా శాసనసభాపక్ష నేతగా మనోహర్​లాల్​ ఖట్టర్​ ఎంపిక ఖరారైంది.

12:35 October 26

ఖట్టర్​ ఎంపిక...

హరియాణాలో జరుగుతున్న భాజపా శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా మనోహర్​లాల్​ ఖట్టర్​ ఎన్నికయ్యారు. ఇందు వల్ల హరియాణా సీఎం బాధ్యతలను రెండోసారి చేపట్టనున్నారు ఖట్టర్​. 

12:13 October 26

శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం

ఛండిగఢ్​లోని యూటీ అతిథి గృహంలో భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మనోహర్​ లాల్​ ఖట్టర్​ సహా కాషాయ పార్టీలోని పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. ఖట్టర్​ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నారు కమలం పార్టీ ఎమ్మెల్యేలు. 

ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండదని భాజపా వర్గాలు స్పష్టం చేశాయి. రేపు మధ్యాహ్నం సీఎంగా ఖట్టర్​ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

11:30 October 26

కండా మద్దతు'పై భాజపా వైఖరి ఏంటీ!

వివిదాస్పద నేత గోపాల్​ కండా మద్దతుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హరియాణా భాజపా వ్యవహారాల బాధ్యులు అనిల్​ జైన్​ తెలిపారు. మరికొద్ది సేపట్లో జరగనున్న భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఈ విషయంపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

2012లో ఓ మహిళను బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రరేపించారని కండాపై ఆరోపణలున్నాయి. తాజా ఎన్నికల అనంతరం... భాజపాకు మద్దతు ప్రకటించారు గోపాల్​ కండా. ఆయన మద్దతును కమలం పార్టీ అంగీకరించేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో విపక్షం సహా సొంత పార్టీ నుంచే కాషాయ దళానికి వ్యతిరేకత ఎదురైంది.

11:02 October 26

జేజేపీ మద్దతుతో

హరియాణాలో రాజకీయ ఉత్కంఠకు శుక్రవారం రాత్రి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమైంది. ఎన్నికల్లో సాధారణ మెజార్టీ సాధించనప్పటికీ.. జేజేపీ సహా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కమలం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. భాజపాకు ముఖ్యమంత్రి పదవి, జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

10:45 October 26

మరికాసేపట్లో భాజపా శాసనసభాపక్ష సమావేశం

మరికాసేపట్లో హరియాణాలోని చంఢిగఢ్​లో భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే పలువురు అగ్రనేతలు, ఎమ్మెల్యేలు అతిథి గృహానికి చేరుకున్నారు. మనోహర్​లాల్​ ఖట్టర్​ కొంత సమయంలో సమావేశ ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. 

Last Updated : Oct 26, 2019, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details