తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమిత్‌ షా నివాసంలో మంత్రుల భేటీ-ఆందోళనపై చర్చ - వ్యవసాయ చట్టాలు రైతుల నిరసన

live-updates-farmers-protests-in-delhi-against-new-farm-laws
దిల్లీలో ఆగని రైతుల నిరసనలు

By

Published : Dec 2, 2020, 9:26 AM IST

Updated : Dec 2, 2020, 3:31 PM IST

15:27 December 02

రైతుల ఆందోళనకు మద్ధతుగా జంతర్ మంతర్ వామపక్షాల నిరసన ప్రదర్శన

ప్రదర్శనలో పాల్గొన్న వివిధ వామపక్షాలు, ప్రజా సంఘాలు

కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

''రైతాంగానికి వ్యతిరేకంగా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. రైతులకు మద్ధతుగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.  చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పార్లమెంటులో చర్చించకుండా.. ఇప్పుడు ప్రతి క్లాజుపై చర్చించాలని అంటోంది. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మద్ధతు ధర ఇవ్వడానికి సిద్ధమని చెబుతూ చట్టంలో చేర్చలేదు. మద్ధతు ధరపై ప్రత్యేకంగా చట్టమూ తీసుకురాలేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం.''

    -  బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు

12:52 December 02

రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఏఐఎంటీసీ

  • రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్
  • రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే .. ఉత్తర భారతదేశం నుంచి కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించిన ఏఐఎంటీసీ
  • సరుకు రవాణా సేవలు క్రమంగా భారతదేశం అంతటా నిలిపివేయనున్నట్లు ప్రకటించిన ఏఐఎంటీసీ

12:50 December 02

జాబితా తయారు చేస్తున్న కేంద్రం

  • రైతు సమస్యలపై చర్చకు కేంద్ర ఉన్నతాధికారుల జాబితా తయారు చేస్తున్నట్లు సమాచారం
  • చర్చల్లో వ్యవసాయ, గృహ, వినియోగదారుల మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొనే అవకాశం
  • 3 బిల్లుల్లో ఉన్న ప్రతి నిబంధనపై ఓ అధికారి రైతులకు వివరించే అవకాశం
  • కార్యదర్శిస్థాయి అధికారులే రైతులతో చర్చల్లో పాల్గొంటారని వెల్లడి

12:16 December 02

షా నివాసంలో మంత్రుల భేటీ

  • రైతుల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నివాసంలో మంత్రుల భేటీ
  • భేటీలో పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌
  • నిన్న రైతులతో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపిన మంత్రులు
  • కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందేనని స్పష్టం చేసిన రైతు సంఘాలు
  • చర్చల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన విరమించేది లేదన్న రైతు సంఘాలు
  • నిన్నటి చర్చల ప్రక్రియ, తదుపరి పరిణామాలపై చర్చిస్తున్న మంత్రులు

11:11 December 02

నిరసనల మధ్యే వంట

దిల్లీ సరిహద్దులో పాగా వేసిన రైతన్నలు.. ఓవైపు నిరసనలు సాగిస్తూనే మరోవైపు వంటలు చేసుకుంటున్నారు. రోడ్ల మీద వరుసలో కూర్చిని సహచరులకు వడ్డిస్తున్నారు. బుధవారం ఉదయం లంగరు వండిన రైతులు.. ఇలా రోడ్ల మీదే ఆరగించారు.

10:56 December 02

ఏడో రోజుకు చేరిన నిరసనలు

  • దేశరాజధాని సరిహద్దుల్లో ఏడో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • సింఘు, టిక్రి, ఘాజిపూర్ సరిహద్దుల వద్ద రైతుల ఆందోళన
  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్
  • కేంద్రంతో నిన్న చర్చలు జరిపిన రైతు సంఘాలు
  • అసంపూర్తిగానే ముగిసిన కేంద్రం, రైతు సంఘాల చర్చలు
  • కొత్త వ్యవసాయ చట్టాల్లోని అభ్యంతరాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోరిన కేంద్రం
  • అభ్యంతరకర అంశాలను ఇవాళ కేంద్రానికి సమర్పించనున్న రైతు సంఘాలు
  • రేపు మరోమారు రైతు సంఘాలతో చర్చలు జరపనున్న కేంద్రం
  • చర్చలు కొలిక్కి వచ్చేదాకా శాంతియుత నిరసన కొనసాగుతుందన్న రైతు సంఘాలు

10:49 December 02

సరిహద్దుల్లో ఆంక్షలు

  • రైతుల ఆందోళనలతో ఇతర రాష్ట్రాల వాహనాల రాకపోకలపై ఆంక్షలు
  • హరియాణా, యూపీ నుంచి దిల్లీకి వచ్చే మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు
  • నోయిడా నుంచి దిల్లీ వెళ్లే చిల్లా సరిహద్దు మూసివేత
  • బదుసరయ్‌ సరిహద్దుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి
  • వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు

09:12 December 02

ఆగని నిరసనలు

దిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన చలిని తట్టుకుని అన్నదాతలు నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం.. దిల్లీ-యూపీ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మరోవైపు సింఘు సరిహద్దు వద్ద కూడా రైతులు ఆందోళనలు చేపట్టారు.

Last Updated : Dec 2, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details