సుష్మ భౌతికకాయం లోధి రోడ్ శ్మశాన వాటికకు చేరుకుంది. మరికాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భాజపా సీనియర్ నేత అడ్వాణీ సుష్మ అంతిమ వీడ్కోలుకు హాజరయ్యారు.
లైవ్: అశ్రునయనాలతో సుష్మకు అంతిమ వీడ్కోలు - సంతాపం
15:47 August 07
సుష్మకు కన్నీటి వీడ్కోలు
15:08 August 07
సుష్మా స్వరాజ్ అంతిమ యాత్ర ప్రారంభం
గుండెపోటుతో కన్నుమూసిన విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది.
అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సుష్మ అంత్యక్రియలు జరగనున్నాయి.
14:52 August 07
సుష్మ మృతికి అమెరికా సంతాపం
సుష్మాస్వరాజ్ మృతిపట్ల సంతాపం తెలిపింది అమెరికా రాయబార కార్యాలయం.
- అమెరికా-భారత్ సంబంధాల బలోపేతానికి సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారు.
- 2018ద్వైపాక్షిక చర్చల్లో సుష్మాస్వరాజ్ కీలకపాత్ర పోషించారు.
13:34 August 07
శ్రద్ధాంజలి ఘటించిన యోగి
పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దివంగత నేతకు శ్రద్ధాంజలి ఘటించారు.
13:19 August 07
అమిత్ షా, నడ్డా నివాళులు
భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న సుష్మా స్వరాజ్ భౌతిక కాయానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించారు.
12:58 August 07
భాజపా ప్రధాన కార్యాలయంలో సుష్మ పార్థివదేహం
సుష్మా స్వరాజ్ భౌతికకాయం భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం భాజపా ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
12:35 August 07
భాజపా కార్యాలయానికి సుష్మ భౌతికకాయం...
సుష్మా స్వరాజ్ భౌతికకాయాన్ని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం భాజపా ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అనంతరం ప్రభుత్వ అధికార లాంఛనాలతో విదేశాంగ మాజీ మంత్రి అంత్యక్రియలు జరగనున్నాయి.
12:16 August 07
సుష్మకు 'విదేశీ వందనం'
సుష్మా స్వరాజ్ మృతి పట్ల అనేక దేశాలు సంతాపం తెలిపాయి. భారత్‌తో సంబంధాలు బలపడటంలో సుష్మ కీలక పాత్ర పోషించారని కొనియాడాయి. సింగపూర్, రష్యా, యూఏఈ దేశాల విదేశాంగ మంత్రులు సుష్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా... సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. తమ దేశానికి సుష్మ మంచి మిత్రురాలని కొనియాడారు.
12:01 August 07
సుష్మ మృతితో భాజపా నేతల భావోద్వేగం
విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 67 ఏళ్ల సుష్మ దేశ రాజకీయల్లో కీలక పాత్ర పోషించారు. సుష్మ భౌతికకాయాన్ని ప్రజలు, నేతల సందర్శనార్ధం ఆమె నివాసానికి తరలించారు. రాత్రి నుంచి సుష్మా స్వరాజ్ పార్థివదేహాన్ని సందర్శించడానికి భారీ సంఖ్యలో నేతలు, ప్రజలు ఆమె నివాసానికి తరలివెళ్లారు. భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. సుష్మ మృతితో కొందరు నేతలు భావోద్వేగానికి లోనయ్యారు.
మరికొద్ది సేపట్లో సుష్మ భౌతికకాయాన్ని దిల్లీలోని భాజపా కార్యాలయానికి తరలించే అవకాశముంది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సుష్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనె అవకాశముందని సమాచారం.
11:44 August 07
'ప్రజల నేత సుష్మ...'
సుష్మా స్వరాజ్ మృతిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. సుష్మ అందరి సమస్యలను అర్థం చేసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేవారని తెలిపారు. సుష్మ హఠాన్మరణంతో ఈరోజు దేశం మెత్తం బాధపడుతోందన్నారు.
11:29 August 07
సుష్మా స్వరాజ్ మృతిపై ఆజాద్ స్పందన..
సుష్మా స్వరాజ్ మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ అజాద్ స్పందించారు.
- సుష్మాస్వరాజ్ అన్ని పార్టీల నేతలతో సోదరిగా ఉండేవారు
- భాజపాలో గొప్ప,ధీరోధాత్తమైన నాయకురాలు
- పార్టీపరంగా కొన్ని అంశాలపై విభేదించినప్పటికీ వ్యక్తిగతంగా అందరితో చాలా బాగా ఉండేవారు
11:17 August 07
రాజ్యసభలో సంతాపం..
సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, సభ్యులు సభలో సంతాపం తెలిపారు. సభలో కొంతసేపు మౌనం పాటించారు.
11:14 August 07
సుష్మ నివాసం వద్ద రాహుల్ గాంధీ...
విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నివాసానికి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. సుష్మ భౌతికకాయానికి నివాళులర్పించారు.
10:56 August 07
హరియాణాలో సంతాప దినాలు
హరియాణా ప్రభుత్వం రెండు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. సుష్మా స్వరాజ్ హఠాన్మరణం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం సుష్మ మృతి పట్ల రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
10:44 August 07
సుష్మా స్వరాజ్‌కు అమిత్ షా నివాళి...
సుష్మ నివాసానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమె పార్థివదేహానికి నివాళులర్పించారు. జాతీయ రాజకీయాల్లో సుష్మ చెరగని ముద్ర వేశారని మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు షా.
10:33 August 07
సుష్మ నివాసానికి మన్మోహన్ సింగ్...
సుష్మా స్వరాజ్ భౌతికకయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
10:20 August 07
అడ్వాణీ భావోద్వేగం...
విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పార్థివదేహానికి భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ నివాళులర్పించారు. సుష్మా భౌతికకాయం చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు అడ్వాణీ.
09:51 August 07
సుష్మా స్వరాజ్‌కు ప్రధాని నివాళి..
సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి ప్రధాని నివాళులర్పించారు. సుష్మా కుటుంబ సభ్యులను మోదీ ఓదార్చారు. ఈరోజు సాయంత్రం జరగనున్న సుష్మా స్వరాజ్ అంత్యక్రియల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సమాచారం.
09:46 August 07
సుష్మా నివాసానికి వెంకయ్య...
దిల్లీలోని సుష్మా స్వరాజ్ నివాసానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు... అమె పార్థివదేహానికి నివాళులర్పించారు.
09:32 August 07
రెండు రోజులపాటు సంతాప దినాలు
సుష్మాస్వరాజ్ పార్థివదేహానికి రాష్ట్రపతి నివాళులర్పించారు. సుష్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
09:24 August 07
సుష్మాస్వరాజ్ పార్థివదేహానికి రాష్ట్రపతి నివాళి
సుష్మా స్వరాజ్ మృతి ఎంతో బాధాకరమని భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ తెలిపారు. సుష్మా మృతి వల్ల వ్యక్తిగతంగా తనకు ఎంతో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందన్నారు.
09:06 August 07
'దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది'
సుష్మా స్వరాజ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సుష్మాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుష్మా స్వరాజ్ గొప్ప నేత, మంచి వ్యక్తి అని కొనియాడారు.
08:48 August 07
'సుష్మాస్వరాజ్ మృతి చాలా బాధాకరం'
భాజపా సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా.. దిల్లీ ఎయిమ్స్‌లో గుండెపోటుతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్లో సుష్మా స్వరాజ్ జన్మించారు. 1970లలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఎంపీగా ఏడుసార్లు, మూడుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు సుష్మా.
1977లో 25 ఏళ్ల పిన్న వయసులోనే హరియాణా కేబినెట్ మంత్రిగా పనిచేశారు. దిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా... 1998 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. వాజ్‌పేయీ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, సమాచారశాఖ మంత్రిగా సేవలు అందించారు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. ఆరోగ్య కారణాల రీత్యా 2019లో పోటీకి దూరంగా ఉన్నారు సుష్మాస్వరాజ్.
సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. 1990 నుంచి 1993 వరకు మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు స్వరాజ్ కౌశల్.
08:26 August 07
సుష్మ ఇక లేరు...
భాజపా సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా.. దిల్లీ ఎయిమ్స్‌లో గుండెపోటుతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్లో సుష్మా స్వరాజ్ జన్మించారు. 1970లలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఎంపీగా ఏడుసార్లు, మూడుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు సుష్మా.
1977లో 25 ఏళ్ల పిన్న వయసులోనే హరియాణా కేబినెట్ మంత్రిగా పనిచేశారు. దిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా... 1998 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. వాజ్‌పేయీ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, సమాచారశాఖ మంత్రిగా సేవలు అందించారు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. ఆరోగ్య కారణాల రీత్యా 2019లో పోటీకి దూరంగా ఉన్నారు సుష్మాస్వరాజ్.
సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. 1990 నుంచి 1993 వరకు మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు స్వరాజ్ కౌశల్.