రాజ్యాంగ, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో న్యాయస్థానాల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ 2018లో తాము ఇచ్చిన తీర్పును అమలు చేసే అంశంపై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పును అమలు చేయాలంటూ న్యాయవాది ఇందిరా జైసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. కోర్టు పరిపాలనా ముఖ్యుడిగా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడమే సరైనదని అభిప్రాయపడింది.
'విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సీజేఐదే తుది నిర్ణయం' - సుప్రీంకోర్టు
కీలక అంశాల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. తాజాగా ఈ అంశం అమలుపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పును అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది ధర్మాసనం.
'విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సీజేఐదే తుది నిర్ణయం'
తమ పరిపాలనా విభాగానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుకు తీసుకువెళతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్.. ప్రత్యక్ష ప్రసారానికి వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:- గోద్రా అల్లర్లు: 'మోదీకి క్లీన్చిట్'పై ఏప్రిల్ 14న విచారణ
Last Updated : Feb 29, 2020, 4:31 AM IST