తెలంగాణ

telangana

'మోదీజీ.. వడ్డీ వ్యాపారం ఆపి, సాయం చేయండి'

By

Published : May 16, 2020, 12:52 PM IST

Updated : May 16, 2020, 3:38 PM IST

దేశంలోని పేద ప్రజలు, రైతులకు నేరుగా నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అప్పులిస్తూ 'వడ్డీ వ్యాపారి'లా వ్యవహరించడం కేంద్రం మానుకోవాలని హితవు పలికారు. డిమాండ్ లేకపోతే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. కరోనా సంక్షోభంతో పోలిస్తే ఈ ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించారు.

rahul gandhi
రాహుల్ గాంధీ

దేశ ప్రజలకు కేంద్రం అప్పులు ఇస్తూ 'వడ్డీ వ్యాపారి'లా వ్యవహరించడం మానుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీపై పునరాలోచన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన రాహుల్.. దేశంలో డిమాండ్ పెంచే చర్యలు తీసుకోవాలని కేంద్రానిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెప్పారు. డిమాండ్ సృష్టించకపోతే దేశం ఆర్థికంగా చాలా నష్టపోతుందని.. ఇది కరోనా ప్రభావం కంటే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

నేరుగా డబ్బులివ్వండి

దేశం​లోని పేద ప్రజలకు ఇప్పుడు డబ్బులు అవసరమని, అందువల్ల వారి ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయాలని కోరారు రాహుల్. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు నేరుగా డబ్బులు అందించాలని విన్నవించారు.

ప్రభుత్వం డబ్బులు నేరుగా ఇవ్వకపోవడానికి కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు రాహుల్. ప్రస్తుతం లోటును పెంచుకుంటే.. విదేశీ సంస్థలు దేశ వృద్ధి రేటింగ్​లను తగ్గిస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్​ను తెలివిగా సడలించడం ముఖ్యమని రాహుల్ వ్యాఖ్యానించారు. వృద్ధుల ప్రాణాలు వైరస్​కు బలికాకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.

Last Updated : May 16, 2020, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details