కర్ణాటక మైసూరులో దారుణం చోటుచేసుకుంది. మైసూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడు పరిమళ శ్యాం దగ్గర డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో పలుమార్లు కిరాతకంగా గాయపరిచి హత్యచేశాడు. కోటె మండలం అంతరాసంతే గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కర్ణాటకలో దారుణ హత్య- అక్రమ సంబంధమే కారణం!
కర్ణాటకలో దారుణ హత్య జరిగింది. మైసూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
కర్ణాటకలో దారుణ హత్య
తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
నిందితుడు రవి(40)ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన నేరాన్ని రవి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 29, 2020, 8:40 PM IST