నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్), జాయింట్ ఎలిజిబిలిటి ఎగ్జామినేషన్ (జేఈఈ )పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న విద్యార్థుల మన్ కీ బాత్‌ను కేంద్రం వినాలన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కరోనా వేళ పరీక్షలకు హాజరు కాలేని వారి దీనస్థితిని అర్థం చేసుకుని పరిష్కారం చూపాలని కోరారు.
సెప్టెంబర్ 1-16 మధ్య జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ). అయితే, కరోనా వేళ పరీక్షలు రాయలేని లక్షలాది మంది విద్యార్థుల ఆవేదనను వినాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు రాహల్.
"ఈ రోజు లక్షలాది మంది విద్యార్థుల మనసులోని మాట కేంద్రం విని తీరాలి. వారు ఆమోదించగలిగే పరిష్కారం చూపాలి."