తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలకు ఓకే - మద్యం అమ్మకాలు

దేశవ్యాప్తంగా ఉన్న గ్రీన్​ జోన్లలో మద్యం దుకాణాలకు అనుమతులిచ్చింది కేంద్రం. ఈ మేరకు లాక్​డౌన్​ పొడిగింపు మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి పలు నిబంధనలను విధించింది కేంద్రం. వీటిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

LIQUOR SALES TO RESUME IN GREEN ZONES
మందుబాబులకు శుభవార్త.. అక్కడ మద్యం అమ్మకాలుకు ఓకే

By

Published : May 2, 2020, 6:50 AM IST

Updated : May 2, 2020, 7:00 AM IST

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ను మరోమారు పొడిగించింది కేంద్రం. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం దుకాణాలు, వివాహాలు, అంత్యక్రియల నిర్వహణపై ప్రత్యేక సూచనలు చేసింది.

  • గ్రీన్‌జోన్లలో మద్యం దుకాణాలు, పాన్‌షాపులకు అనుమతి
  • దుకాణాల వద్ద కనీసం 6 అడుగులు భౌతిక దూరం పాటించాలి
  • దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండకుండా చూడాలని ఆదేశం.

వివాహాలు, అంత్యక్రియలపై..

  • వివాహాలు వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
  • అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 కంటే ఎక్కువ మందికి అనుమతి నిరాకరణ
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేయాలని ఆదేశం
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్‌, గుట్కా, పొగాకు నమలడం నిషేధం
Last Updated : May 2, 2020, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details