తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి రూ.28,400కోట్ల ప్యాకేజీ - జమ్ముకశ్మీర్​లో పెట్టుబడుల ఆకర్షణ

జమ్ముకశ్మీర్​లో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అక్కడి యంత్రాంగం నూతన పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.28,400కోట్ల రూపాయల ప్యాకేజీని లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా ప్రకటించారు. దీని కింద 2037 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

LG announces new industrial development scheme worth Rs 28,400 cr for J-K
జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి రూ.28,400కోట్ల ప్యాకెజీ

By

Published : Jan 7, 2021, 5:54 PM IST

జమ్ముకశ్మీర్​లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అక్కడి పాలనా యంత్రాంగం రూ. 28,400 కోట్లతో నూతన పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని ప్రకటించింది. ఈ ప్రాంతపు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపిందని లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా తెలిపారు. 2037వరకు ఈ పథకం అమల్లో ఉండనుందని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయి వరకు..

ఉపాధి కల్పన ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మనోజ్​ సిన్హా వివరించారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు.. పారిశ్రామిక అభివృద్ధిని బ్లాక్​ స్థాయి వరకు విస్తరించేందుకు వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జమ్ముకశ్మీర్​లో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి ఈ పథకం తోడ్పడుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. దీర్ఘకాలంలో వారిని అభివృద్ధి పథంలో నడిపించే పథకంగా ఇది నిలిచిపోతుంది.

-మనోజ్​ సిన్హా, లెఫ్టినెంట్​ గవర్నర్​.

ఈ పథకం కింద.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిశ్రమలకు 5శాతం చొప్పున మూలధన సహాయాన్ని 5 సంవత్సరాల వరకు అందిస్తారు. ఈ ప్రాంతంలో తయారీ, సేవా రంగ పరిశ్రమల స్థాపన లక్ష్యంగా ఈ పథకం అమలు కానుంది.

ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్​ను కమ్మేసిన మంచు -స్తంభించిన జనజీవనం

ABOUT THE AUTHOR

...view details