కొత్త దశాబ్దిలోకి సుస్థిర అడుగులేద్దాం.. నవ భారతాన్ని నిర్మిద్దాం - UN NEWS
ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఐక్యరాజ్యసమితి నాలుగేళ్ల కిందటే అమల్లో తెచ్చిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీలు)ను ఒడుపుగా అందిపుచ్చుకుని.. వాటికి భారతీయతను జోడించింది నీతి ఆయోగ్. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా కొంగొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకుని.. వాటి ఆచరణకు శ్రీకారం చుట్టింది. ఇవి సంపూర్ణంగా అమలైతే రాబోయే పదేళ్లలో నవ భారత నిర్మాణం సాధ్యమే.
మనదేశం మహోన్నత భవితను స్వప్నిస్తోంది. సకల జనుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తోంది. ఆకలి దప్పుల్లేని, రోగాలు రొష్ఠులు దరిచేరని, అన్ని రకాల అసమానతల్ని తొలగించే, ప్రకృతి వనరుల్ని పరిరక్షించే, లింగ సమానత్వాన్ని సాధించే సమాజ నిర్మాణాన్ని అభిలషిస్తోంది. ఇందుకోసం 2030 సంవత్సరం దాకా వివిధ రంగాల్లో దేశం సాధించాల్సిన పురోగతిని విస్పష్టంగా నిర్దేశించుకుని.. దానిని అక్షరబద్ధం చేసింది. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఐక్యరాజ్యసమితి నాలుగేళ్ల కిందటే అమల్లో తెచ్చిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీలు)ను ఒడుపుగా అందిపుచ్చుకుని.. వాటికి భారతీయతను జోడించింది. ఈ లక్ష్యాల్ని పరిపూర్ణంగా సాధించే బాధ్యతల్ని అందిపుచ్చుకున్న నీతి ఆయోగ్- ఐరాస ఎస్‌డీజీలను ప్రామాణికంగా తీసుకుని.. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా కొంగొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకుని.. వాటి ఆచరణకు శ్రీకారం చుట్టింది. ఇవి సంపూర్ణంగా అమలైతే రాబోయే పదేళ్లలో నవ భారత నిర్మాణం సాధ్యమే!!