తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం!' - భాజపా వర్సెస్ పోలీసులు

బంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ.. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కోసమే పోలీసులు పనిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వారందరితో బూట్లు నాకిస్తామని చెప్పారు.

bjp
రాజు బెనర్జీ

By

Published : Nov 25, 2020, 2:36 PM IST

బంగాల్‌ పోలీసులు ప్రజల కోసం పనిచేయడం లేదని, ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని ఆ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ ఆరోపించారు. భాజపా అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రాష్ట్రంలో జరిగే నేరాలను అరికట్టకుండా కేవలం ప్రభుత్వ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు.

దుర్గాపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో రాజు బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

"బంగాల్​లో గూండా రాజ్యం సాగుతోంది. రాష్ట్రంలో జరిగే నేరాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాంటి పోలీసులను ఏం చేద్దాం? అధికారంలోకి వచ్చాక వారితో బూట్లు నాకిద్దాం."

- రాజు బెనర్జీ

బంగాల్‌లో గత కొద్దిరోజులుగా భాజపా నేతలకు, తృణమూల్‌ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గియా కూడా మంగళవారం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రిగా మహిళా నేత ఉన్నా.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఒక చట్టం నడుస్తుంటే బంగాల్‌లో మాత్రం టీఎంసీ చట్టం నడుస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇదీ చూడండి:న్యాయవ్యవస్థ పరిధిపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details