సాధారణంగా ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ పుడుతుంది. అయితే రాజస్థాన్ అజ్మేర్లో ఓ వినూత్న ప్రేమ జంట దర్శనమిచ్చింది. ఇద్దరు అమ్మాయిల మనసులు కలిసి.. వారి మధ్య ప్రేమ చిగురించింది. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమికులు. ఒక్కటిగా కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. పెళ్లికి ఇరువురి కుటుంబీకులు అంగీకారం తెలపలేదు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అవసరమైతే కుటుంబాలను సైతం వదిలేసేందుకు సిద్ధమంటున్నారు.
మాకు ఆ అధికారముంది
మేజర్లు అయిన తాము ఎలా జీవించాలో నిర్ణయం తీసుకునే అధికారం తమకుందంటోంది ఈ ప్రేమజంట. మొదట్లో రోజూ కలుసుకునేప్పుడు తమ కుటుంబ సభ్యులెవరూ అడ్డు చెప్పలేదని.. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో మేము రహస్యంగా కులుసుకుంటున్నామని పోలీసులకు వివరించారు.