తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్నికి ఆహుతైన ఐదు చిరుతకూనలు! - leopard cubs

మహారాష్ట్ర పుణె సమీపంలో ఐదు చిరుత కూనలు మంటల్లో కాలి చనిపోయాయి. చెరకు పొలంలో పోగు చేసిన చెత్తలో సేదతీరుతున్న ఈ చిరుత పిల్లలను... పొలం యజమాని గమనించకుండా చెత్తకు నిప్పుపెట్టారు. దీంతో చిరుత కూనలు క్షణాల్లో అగ్నికి ఆహుతైపోయాయి. జున్నార్​ మండలం అవసారి గ్రామంలో జరిగిన ఈ ఘటన పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

అగ్నికి ఆహుతైన అయిదు చిరుతకూనలు

By

Published : Apr 4, 2019, 1:08 PM IST

అగ్నికి ఆహుతైన అయిదు చిరుతకూనలు
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఐదుచిరుత కూనలు. అవి సేదతీరేందుకు చెరకు పొలంలోని చెత్తను ఎంచుకుందా తల్లి చిరుత. పిల్లలను అక్కడ నిద్రపుచ్చి.. తను ఆహారం కోసం వేటకెళ్లింది. తిరిగొచ్చే సరికి ఘోరం జరిగిపోయింది. అభం శుభం తెలియని ఆ పసి చిరుతలు మంటల్లో కాలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి.

మంటలు అంటుకున్న సమయానికి తల్లి అందుబాటులో లేక... ఏం చేయాలో, ఎటుపోవాలో పాలుపోక.. బుల్లి చిరుతలు అగ్ని జ్వాలలకి ఆహుతైపోయాయి. చిరుతలను గమనించకుండా పోగుచేసిన చెరకుతోట చెత్తకు రైతు నిప్పంటించటమే పసికూనల ప్రాణాలు బలయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తుంది.

ఇదీ జరిగింది...

మహారాష్ట్రలోని పుణె జిల్లా జున్నార్​ మండలం అవసారి గ్రామంలో జరిగిందీ ఘటన. ఓ చెరకు రైతు పొలంలో పోగుచేసిన చెరకు పంట చెత్తలో చిరుత కొద్ది రోజులుగా తన పిల్లలతో సహా ఆవాసం ఏర్పరుచుంది. చిరుత, కూనలు నివాసముంటున్న విషయాన్ని గమనించలేదు ఆ రైతు. తదుపరి పంట కోసం తన పొలంలో పోగుచేసిన ఆ చెత్తకు నిప్పుపెట్టి చదును చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు కొంతమంది కూలీలను నియమించారు. వాళ్లు కూడా చిరుత కూనలున్నట్లు గమనించకుండానే చెత్తకు నిప్పంటించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చిరుతల ఆవాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో చిరుత పిల్లలకు అర్థం కాలేదు. తేరుకునే లోపే... క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఎటూ వెళ్లలేక ఎగసి పడుతున్న అగ్ని జ్వాలలకు ఆహుతయ్యాయి పసికూనలు.

ABOUT THE AUTHOR

...view details