రాతి కొండల్లో ఉండే ఓ చిరుత.. ఆహారం కోసం మాటు వేసింది. దూరంగా కొండల్లో కనిపించిన లేడిని చూసిన ఆ క్రూరమృగం.. దాన్ని అందుకునేందుకు పరుగు తీసింది. ఎలాగైనా పట్టుకోడానికి చిరుత ప్రయత్నిస్తే.. ప్రాణాలు దక్కించుకోడాని లేడి పరుగుపెట్టింది. రెండు జంతువులు మధ్య జరిగిన జీవన పోరాటంలో.. చిరుత నోటికి చిక్కింది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోని లేడి.. తప్పించుకోడానికి ప్రయత్నించింది.
చిరుత- లేడి మధ్య వార్.. చివరికి ఏమైంది? - deer escaped from leopard
ఆహారం కోసం వెంపర్లాడిన చిరుత.. రాతి కొండల్లో ఓ లేడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే నోటికి చిక్కిిన ఆ లేడి.. చివరకు ఆహారమైందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
మంచు చిరుత
చిరుత నోటి నుంచి విదిలించుకోడానికి తీవ్రంగా శ్రమించింది. అయితే తనకు విధి మద్దతు పలికిందేమో.. ఎదురుగా నది రాగా అనూహ్యంగా చిరుత నోటిలో నుంచి జారి పడింది లేడి. అంతే నీటిలో పడిన ఆ లేడి.. ఈదుకుంటూ తప్పించుకుంది. ఆహారం కోసం పరితపించిన చిరుతకు నిరాశ తప్పలేదు. ఈ వీడియోను ఓ అటవీశాఖ అధికారి పోస్టు చేయగా.. నెట్టింట వైరల్ అయింది.