తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లెక్కల పని కేంద్రానిదే' - casualities

మెరుపుదాడిలో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారు? పాకిస్థాన్​​ ఎఫ్​-16 జెట్​లను ప్రతిఘటించేందుకు భారత్​ మిగ్​-21నే ఎందుకు ఉపయోగించింది?

మాట్లాడుతున్న ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ దనోవా

By

Published : Mar 4, 2019, 3:21 PM IST

Updated : Mar 4, 2019, 5:23 PM IST

'లెక్కల పని కేంద్రానిదే'

మెరుపుదాడిలో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను లెక్కించడం వాయుసేన పనికాదని తేల్చిచెప్పారు ఎయిర్​చీఫ్​ మార్షల్ బీఎస్​ దనోవా. పాకిస్థాన్​ బాలాకోట్​లోని జైషే మహ్మద్​ స్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడిలో ఎంత మంది చనిపోయారన్న ప్రశ్నకు కాస్త కఠినంగానే బదులిచ్చారాయన.

హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ఎంత మంది మరణించారో వాయుసేన చెప్పలేదు. మేము మానవ మరణాలను లెక్కించము. ఎన్ని లక్ష్యాలను చేధించాం అనేది లెక్కిస్తాం.
- బీఎస్​ దనోవా, ఎయిర్​ చీఫ్​ మార్షల్​

మిగ్​-21పై...

ఎఫ్​-16 జెట్​ను ప్రతిఘటించేందుకు మిగ్​-21ను ఉపయోగించడంపై వచ్చిన విమర్శలకు దనోవా జవాబిచ్చారు.

మిగ్​ 21 బైసన్​ను ఎందుకు ఉపయోగించారని అడుగుతున్నారు. రెండు పరిస్థితులు ఉంటాయి. ఒకటి... ప్రణాళిక ప్రకారం దాడిచేయడం. ఇలాంటి సందర్భాల్లో అత్యుత్తమ విమానాలు ఉపయోగిస్తాం. అలా కాకుండా... ప్రత్యర్థి మనపై దాడి చేసినప్పుడు మాత్రం అందుబాటులో ఉన్న ప్రతి విమానాన్నీ ఉపయోగించాలి. దీనికి విమాన రకంతో సంబంధం లేదు. అన్ని విమానాలు శత్రువుపై పోరాటానికి అనువైనవే.
- బీఎస్​ దనోవా, ఎయిర్​ చీఫ్​ మార్షల్​

మెరుపుదాడుల అనంతరం పాకిస్థాన్​ వాయుసేన భారత గగనతలంలోకి చొరబడింది. పాక్​ ఎఫ్​-16 విమానాలను ప్రతిఘటించేందుకు భారత వాయుసేన మిగ్​-21 బైసన్లను ఉపయోగించింది. వీటిలో ఒకటి పాక్​ యుద్ధ విమానాన్ని కూల్చింది. ఎదురుదాడిలో కుప్పుకూలింది.

Last Updated : Mar 4, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details