ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల కోసం భారత్లో ప్రతి ఏటా ఓ ప్రధాన వేదికను నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఈసారి ఆ అవకాశం లద్దాఖ్ రాజధాని లేహ్ను వరించింది. ఈ విషయాన్ని ఆయుష్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు అధికారులు.
ఈ కార్యక్రమంలో మోదీ పలు యోగాసనాలు వేయనున్నారు. సుమారు 15 నుంచి 20 వేల మంది ఈ వేడుకల్లో పాల్గొంటారని అంచనా.
"ఐడీవై(ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా)-2020 చాలా ప్రత్యేకమైనది, భిన్నమైనది. లేహ్ వంటి అత్యంత ఎత్తయిన ప్రాంతంలో.. ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి."
-- శ్రీపాద్ నాయక్, ఆయుష్ మంత్రి