మలయాళ దిగ్గజ కవి అక్కితం అచ్యుతన్ నంబూదిరి గురువారం ఉదయం త్రిశూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. మలయాళంలోని మొట్టమొదటి ఆధునిక కవిత్వంతో నవ ఒరవడి సృష్టించిన వ్యక్తిగా కీర్తి గడించారాయన. పాలక్కడ్‌లో జన్మించిన నంబూదిరి కవిత్వంతో పాటు అనేక గొప్ప వ్యాసాలు కూడా రాశారు.
సాహితీ లోకానికి నంబూదిరి చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2017 లో పద్మశ్రీతో సత్కరించింది. సాహితీ ప్రపంచంలో గొప్పదైన జ్ఞానపీఠ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. గత నెలలోనే ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఎళుతాచ్చన్ పురస్కారం సహా కేరళ సాహిత్య అకాడమీ అవార్డులూ గెలుచుకున్నారు అక్కితం.