మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దిగ్భ్రాంతికిగురిచేసిందని తెలిపారు.
"కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ప్రణబ్ అంతర్గత భాగం. విజ్ఞత, అనుభవం, సలహాలు, అనేక అంశాల్లో అవగాహన ఉన్న వ్యక్తి ప్రణబ్. ఆయన లేకుండా పార్టీ మనుగడ ఊహించటం కష్టంగా ఉంది. ఆయన అలంకరించిన ప్రతి పదవికి ప్రత్యేకత తెచ్చారు. "
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
మనోవేదనకు గురయ్యా..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రణబ్‌కు నివాళులు అర్పించారు.
"మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దురదృష్టవశాత్తు మరణించిన వార్త విని దేశమంతా విచారం అలుముకుంది. ఈ వార్త తెలిసి నేను మనోవేదనకు గురయ్యాను. ఆయనకు దేశ ప్రజలందరితో పాటు నేను కూడా శోకతప్త నివాళులు అర్పిస్తున్నాను. ప్రణబ్ కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను"