విదేశాంగ శాఖ మాజీ మంత్రి, భాజపా సీనియర్ నాయకురాలు దివంగత సుష్మా స్వరాజ్ తొలి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు. దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
నిస్వార్థ సేవకురాలు..
సుష్మా స్వరాజ్ తొలి వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు.
''తన తొలి పుణ్య తిథి సందర్భంగా 'సుష్మా జీ'ని గుర్తుచేసుకోవాలి. ఆమె అకాల మరణం చాలా మందిని బాధపెట్టింది. సుష్మా నిస్వార్థంగా దేశానికి సేవ చేశారు. ప్రపంచ వేదికపై భారత గొంతుకను వినిపించారు.''
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా..
సుష్మా స్వరాజ్ తొలి వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 'సుష్మాను భారతీయ సంస్కృతికి సారాంశంగా భావించారు. ఆమె ఆధునిక ఆలోచన, సంప్రదాయ విలువల సమ్మేళనం. ఆమె ఎప్పుడూ సీనియర్లు, పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారు. అత్యంత స్నేహపూర్వక నేతల్లో ఒకరు. ప్రతి ఒక్కరినీ ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునే వారు' అని పేర్కొన్నారు వెంకయ్య.