తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇందిరా గాంధీకి మోదీ సహా ప్రముఖుల నివాళులు - మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సహా పలువురు నేతలు దిల్లీలోని శక్తిస్థల్ వద్ధ శ్రద్ధాంజలి తెలిపారు.

నేడు ఇందిరా గాంధీ జయంతి-మోదీ సహా నేతల నివాళులు

By

Published : Nov 19, 2019, 11:19 AM IST

Updated : Nov 19, 2019, 3:25 PM IST

ఇందిరా గాంధీకి మోదీ సహా ప్రముఖుల నివాళులు

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురష్కరించుకుని దేశవ్యాప్తంగా నేతలందరూ మాజీ ప్రధానికి నివాళులు తెలుపుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఇందిరా గాంధీకి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఉక్కుమహిళ జన్మదినాన్ని పురస్కరించుకొని దిల్లీలోని శక్తిస్థల్​ వద్ద కాంగ్రెస్ నేతలు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ సహా పలువురు నేతలు నివాళులు తెలిపారు.

'భారతదేశ తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆమె సంకల్పం, ఆశయసాధనలు భారత్​ను సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. ఇందిరా చేపట్టిన రక్షణ, ఆర్థిక, విదేశీ విధానాలు ఎల్లప్పుడూ ఆదర్శణీయం.' -ట్విట్టర్​లో కాంగ్రెస్

భారత్​ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో ఇందిరా గాంధీ ప్రధాన భూమిక పోషించిందని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ట్వీట్ చేశారు.

'సమర్థవంతమైన నాయకత్వం, అద్భుతమైన నిర్వహణ సామర్థ్యం కలిగి... భారత్ శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించడంలో కీలకపాత్ర పోషించిన ఉక్కు మహిళ, ప్రియమైన నాయనమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా నా నివాళులు.' -రాహుల్​ గాంధీ

కాంగ్రెస్ ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్, మిలింద్ దేవరా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు.

1917 సెప్టెంబర్​ 19న అలహాబద్​లో జన్మించిన ఇందిరా గాంధీ 1966-1977, 1980-84 మధ్య భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. .

Last Updated : Nov 19, 2019, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details