తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పోఖ్రాన్​ పరీక్షను గోప్యంగా ఉంచలేదేం?' - ఏ-శాట్'

ప్రధాని మోదీ మరోసారి కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. 'మిషన్​ శక్తి' ప్రయోగాన్ని రహస్యంగా ఉంచాలన్నవారు (కాంగ్రెస్​ నేత చిదంబరం) పోఖ్రాన్​ అణు పరీక్షను ఎందుకు బహిరంగ పరిచారో ప్రజలకు తెలపాలని చురకలంటించారు.

'పోఖ్రాన్​ అణుపరీక్షను ఎందుకు రహస్యంగా ఉంచలేదు'

By

Published : Mar 31, 2019, 4:21 PM IST

Updated : Mar 31, 2019, 5:24 PM IST

'పోఖ్రాన్​ పరీక్షను గోప్యంగా ఉంచలేదేం?'
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నేతలు అవినీతిలో మునిగితేలారని విమర్శించారు ప్రధాని మోదీ. దేశ ప్రయోజనాలకంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని దుయ్యబట్టారు.

"చాలా కాలం క్రితం నుంచే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి తయారు చేసే సామర్థ్యం భారత్​కు ఉంది. కేవలం రాజకీయ సంకల్పం లేకనే ఇన్నాళ్లపాటు అది వెలుగుచూడలేదు" అని దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ అన్నారు. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై నిర్ణయాన్ని ఆలస్యం చేయడం నేరపూరిత చర్య అని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలు పాకిస్థాన్​కు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాయని మోదీ ప్రశ్నించారు. బాలాకోట్​ వైమానిక దాడికి సాక్ష్యాలు అడుగుతూ భారత సైనిక దళాల సామర్థ్యాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

అవివేక ప్రభుత్వం మాత్రమే దేశ సైనిక రహస్యాలు బయటపెడుతుందన్న కాంగ్రెస్​ నేత చిదంబరం వ్యాఖ్యలపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు.

"ఆయన (చిదంబరం) తనే తెలివైన వాడినని అనుకుంటున్నారు. 'ఏ-శాట్' ప్రయోగాన్ని రహస్యంగా ఉంచాలని ఆయన అన్నారు. అలా అయితే 1974లో పోఖ్రాన్​ అణు ప్రయోగం గురించి ఎందుకు రహస్యంగా ఉంచలేదు. అవినీతి కేసుల్లో కోర్టుకు వెళ్లిన విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచాలని నేను అర్థం చేసుకోగలను." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి :"మోదీ నిర్ణయాలతో సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ"

Last Updated : Mar 31, 2019, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details