తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రామస్థుల సంకల్పం.. 80 రోజుల్లోనే ప్లాస్టిక్​కు చెక్​ - ప్లాస్టిక్ రహిత సమాజం

దేశంలో ఎన్నో నగరాలు, పట్టణాలు ప్లాస్టిక్​ను నిషేధించాలని ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఆ దిశగా అడుగులేసిన మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామం కేవలం 80 రోజుల్లోనే ప్లాస్టిక్​ రహితంగా అవతరించింది.  దేశానికే ఆదర్శంగా నిలిచింది.

గ్రామస్థుల సంకల్పం
గ్రామస్థుల సంకల్పం

By

Published : Jan 9, 2020, 7:44 AM IST

గ్రామస్థుల సంకల్పం.. 80 రోజుల్లోనే ప్లాస్టిక్​కు చెక్​

ప్లాస్టిక్ మహమ్మారిని పారదోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయితే ఐకమత్యంతో ఆ లక్ష్యాన్ని అలవోకగా సాధించొచ్చని నిరూపిస్తోంది మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామం.

ఇండోర్​కు 10 కిలోమీటర్ల దూరంలోని 'సిలోదా'ను 'నీలి గ్రామం'గా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇళ్లు, గోడలన్నీ నీలిరంగులోనే ఉంటాయి. సిలోదా ప్రాస్టిక్ రహిత గ్రామమని చెప్పేందుకు ఈ రంగును ఎంచుకున్నారు గ్రామస్థులు.

గ్రామస్థుల సమైక్యకృషితో 80 రోజుల్లోనే ప్లాస్టిక్​ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేశారు. ఇతర గ్రామస్థుల్లోనూ స్ఫూర్తిని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే గ్రామంలోని గోడలపై ప్లాస్టిక్ వ్యతిరేక నినాదాలు, శుభ్రతకు సంబంధించిన సూక్తులు దర్శనమిస్తాయి.

"ప్లాస్టిక్​ వ్యర్థాల కారణంగా అనేక వ్యాధులు ప్రబలుతాయి. ఈ కాలంలో చాలా వ్యాధులు వస్తున్నాయి. అందుకే ప్లాస్టిక్​ను నిషేధించాలని నిర్ణయించాం."

- గ్రామస్థురాలు

గతేడాది అక్టోబర్​ 2న గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ప్లాస్టిక్​ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు గ్రామస్థులు. ప్రారంభంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సంచుల వాడకం క్రమంగా పెరిగాక ఆ కష్టాలు తీరాయని చెబుతున్నారు.

"అక్టోబర్​ 2న మా గ్రామానికి కలెక్టర్​ వచ్చారు. ఆయన సమక్షంలో ప్లాస్టిక్​ను నిషేధిస్తామని మేమంతా శపథం చేశాం. 80 రోజుల్లో దీన్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రతిరోజు కృషి చేశాం. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించాం. ప్లాస్టిక్​ వల్ల వచ్చే సమస్యలను ప్రజలకు వివరించాం. ఈ క్రమంలో ప్లాస్టిక్​ కవర్లకు బదులుగా వస్త్రాలతో చేసిన సంచులను దుకాణాలకు అందించాం. రూ.5 ఇస్తే సంచులు ఇస్తారు. మళ్లీ ఆ సంచిని తిరిగి తీసుకొస్తే 5 రూపాయలు ఇస్తారు. ఇలా అందరం కలిసి 80 రోజుల్లో ప్లాస్టిక్​ను తరిమికొట్టాం. "

- సందీప్ మిశ్రా, గ్రామ కార్యదర్శి

ప్రజలను ప్రోత్సహించేందుకు గ్రామ పరిసరాల్లోని ఓ చెట్టును బట్ట సంచులతో అలంకరించారు. అంతేకాదు.. గ్రామంలో ప్లాస్టిక్​ నిషేధం అమలును పర్యవేక్షించేందుకు 10 బృందాలను నియమించారు.

ABOUT THE AUTHOR

...view details