చెన్నైలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి స్థానిక ఎమ్టీహెచ్ రోడ్లోని మోహన్ రెడ్డి ఆసుపత్రి ఎదురుగా ప్రముఖ న్యాయవాది రాజేశ్(38) కూర్చుని ఉండగా.. ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కత్తితో దాడిచేశారు. దారుణంగా పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన న్యాయవాది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన రాజేశ్ ఎగ్మోర్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రాజేశ్ భార్య(రమ్య) రాజకీయ నాయకురాలు. ఆయన బావ పామ్సోము ఓ పేరు మోసిన రౌడీ. అతడిపై హత్య, దోపిడీ, హత్యాయత్నం వంటి పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2015లో జరిగిన ఓ హత్య కేసులో రాజేశ్ ప్రమేయం ఉంది.