తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాయర్​కు ఆస్పత్రిలోకి నో ఎంట్రీ- గుండెపోటుతో మృతి - గుండెనొప్పి

గుండెనొప్పితో బాధపడుతున్న ఓ న్యాయవాది​ని ఆసుపత్రిలో చేర్చుకోని ఘటన ముంబయిలో జరిగింది. ఫలితంగా ఆ వ్యక్తి మృతి చెందినట్లు అతడి భార్య తెలిపింది.

Lawyer dies of heart attack after hospitals refuse admission
గుండెనొప్పితో బాధపడుతున్న వ్యక్తిని చేర్చుకోని వైద్యులు.. చివరికి ఏమైంది?

By

Published : Apr 19, 2020, 10:59 AM IST

మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. గుండెనొప్పితో బాధపడుతున్న 56 ఏళ్ల వ్యక్తికి చికిత్స అందించటానికి వైద్యులు నిరాకరించారు. అతడ్ని మరో ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు.

ఏం జరిగింది?

నవీ ముంబయి వాషి ప్రాంతంలో నివసిస్తున్న జయదీప్​ అనే న్యాయవాది​.. ఏప్రిల్​ 14న మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత అకస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

"అతని నాడి వ్యవస్థను పరీశీలించాను. ఇంకా బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అంబులెన్స్​కు ఫోన్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించాము. కానీ ఆ ఆసుపత్రిలో కరోనా బాధితులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారని, అత్యవసర విభాగం లేదని చెప్పారు. మున్సిపల్​ ఆసుపత్రికి వెళ్తే వారు కూడా చేర్చుకునేందుకు నిరాకరించారు. చివరకు నెరుల్​లోని మరొక ఆసుపత్రికి తరలించాము. కానీ అప్పటికే 30 నిమిషాలు ఆలస్యమైందని, ఆయన మరణించించారని వైద్యులు ధ్రువీకరించారు" అని జయదీప్​ భార్య దీపాలీ( న్యాయవాది) వెల్లడించారు.

"లాక్​డౌన్​ సమయంలో కరోనా బాధితులకు తప్ప మరొకరికి చికిత్స అందించరా? అత్యవసరమైన చికిత్సను అందించకుండా వెనక్కి పంపటం సమంజసమా? సాధారణ చికిత్స విభాగాలను మూసివేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?" అని ఆమె ప్రశ్నించారు.

ఈ ఘటనకు సంబంధించి తన దగ్గర ఎటువంటి ఆధారాలు లేని కారణంగా చికిత్స అందించని ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేనని ఆవేదన వ్యక్తం చేశారు దీపాలీ.

ABOUT THE AUTHOR

...view details