ఈరోజ నిర్వహించే మనసులో మాట (మన్ కీ బాత్) కార్యక్రమంలో ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపైనే తమ దృష్టి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు, క్వారంటైన్ సౌకర్యాలు, వ్యాధి తీవ్రత వంటి కీలక అంశాలపై మాట్లాడనున్నట్లు ట్వీట్ చేశారు.
" ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం ఉంది. నేటి ఎపిసోడ్లో ప్రధానంగా కరోనా కారణంగా ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులపైనే దృష్టి ఉంటుంది. "