గుజరాత్లో 53కు పెరిగిన మరణాలు
గుజరాత్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 53కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 280 మందికి వైరస్ సోకగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1376కు చేరింది.
22:04 April 18
గుజరాత్లో 53కు పెరిగిన మరణాలు
గుజరాత్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 53కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 280 మందికి వైరస్ సోకగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1376కు చేరింది.
19:52 April 18
మహారాష్ట్రలో 3,648కి చేరిన కేసులు
దేశవ్యాప్తంగా ఇవాళ ముంబయిలోనే అత్యధికంగా 184 కేసులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 328 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 3,648కి చేరింది.
19:29 April 18
తమిళనాడులో 1372కు చేరిన కేసులు
19:01 April 18
బ్రిటన్‌లో 15,464
బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 888 మంది మరణించినందున.. దేశవ్యాప్తంగా కొవిడ్-19 మరణాల సంఖ్య 15,464కు చేరింది.
17:52 April 18
దేశవ్యాప్తంగా 15వేలకు చేరువలో కేసులు
దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 488కి చేరింది. మొత్తం కేసులు 14,792కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు 2015 మంది వైరస్ బారినుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.
17:02 April 18
స్పెయిన్‌లో 20వేలు
స్పెయిన్‌లో కరోనా మృత్యుఘోష ఆగట్లేదు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 565 మంది మృతి చెందినందున.. మొత్తం మరణాల సంఖ్య 20వేలు దాటింది. ప్రస్తుతం స్పెయిన్‌లో 20,043 మంది మృత్యువాతపడగా, కేసులు 1,91,726కు చేరింది.
ఇరాన్‌లోనూ కొవిడ్-19 మృతులు 5వేలు దాటింది.
16:27 April 18
విమానసేవలు రెడీ!
మే 4 నుంచి కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్ విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. జూన్ 1 నుంచి అంతర్జాతీయ సేవలనూ పునరుద్ధరించనున్నట్లు అధికారిక వెబ్సైట్లో తెలిపింది. కరోనా నియంత్రణకు కేంద్రం విధించిన లాక్‌డౌన్ మే 3న ముగియనుంది.
16:14 April 18
15:42 April 18
బీమా పొడిగింపు
పోస్టల్ ఉద్యోగులకు కల్పించిన రూ.10 లక్షల బీమాను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ్ డక్ సేవక్స్తో సహా విధులు నిర్వర్తిస్తూ కరోనా కారణంగా ఎవరు ప్రాణాలు కోల్పోయినా ఈ పరిహారం అందిస్తామని తెలిపింది. తాజా మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది కేంద్ర సమాచార శాఖ.
15:12 April 18
కరోనాతో చికిత్స పొందుతూ ఏసీపీ మృతి
కరోనా మహమ్మారి బారినపడి పంజాబ్ లూథియానా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) అనిల్ కోహ్లీ మృతి చెందారు. స్థానిక ఎస్పీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోహ్లీ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
15:08 April 18
ఒక్కొక్కరికి రూ.2వేలు
భవన నిర్మాణ కార్మికులకు బాసటగా నిలిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 లక్షల మంది నమోదిత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2వేలు అందిస్తామని వెల్లడించింది.
15:06 April 18
లాక్‌డౌన్ ఉల్లంఘించారని 10729 మంది అరెస్ట్
మహారాష్ట్రలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ.. ఇప్పటివరకు 10,729 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 33,984 వాహనాలను సీజ్ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీ సెక్షన్ 188 కింద 52,626 కేసులు రిజిస్టర్ చేసినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 మంది పోలీసు అధికారులు, 29 మంది ఇతర పోలీసు సిబ్బంది కరోనా బారిన పడినట్లు వెల్లడించారు.
14:59 April 18
మాజీ ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో 11 మందితో సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. తాజా పరిస్థితుల్లో రోజుకోసారి చర్చించి పార్టీకి సూచనలు చేయనుంది ఈ బృందం. అలాగే పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలనూ ఖరారు చేయనుంది.
14:41 April 18
కరోనా చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై సర్వే చేయాలని, వాటి వినియోగాన్ని పర్యవేక్షించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
13:32 April 18
13:28 April 18
13:07 April 18
ముంబయిలో ఓ కూరగాయల వ్యాపారి-పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చెలరేగింది. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన మాన్ఖుర్ద్లో కూరగాయలు అమ్మకునేందుకు ఓ మహిళా వ్యాపారి రాగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. అయితే ఆమె ఎంత చెప్పినా వినకపోయే సరికి.. కూరగాయల తోపుడు బండిని కిందకు నెట్టేశాడు ఓ కానిస్టేబుల్.
అధికారుల చర్యతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ పోలీసులపై దాడికి యత్నించింది.
12:55 April 18
రాహుల్‌పై శివసేన పొగడ్తలు
కరోనా సంక్షోభంలో ప్రతిపక్ష పార్టీ ఎలా వ్యవహరించాలో రాహుల్ గాంధీ చూపించారని కొనియాడింది శివసేన. ప్రధాని మోదీతో రాజకీయ విబేధాలున్నప్పటికీ.. ప్రజా శ్రేయస్సు కోసం రాహుల్ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారని తమ అధికారిక పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో రాసుకొచ్చింది.
12:37 April 18
కరోనా వైరస్‌పై దేశం యుద్ధం చేస్తున్న సమయంలో.. అంబులెన్స్, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా వర్గాలపై జరుగుతున్న దాడులపై స్పందించారు భాజపా నేత హేమామాలిని. ఇలాంటి దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
12:11 April 18
మధ్యప్రదేశ్‌లో కేసులు 'అప్'
మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా మరికొంతమంది వైరస్ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 1355కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69 మంది మరణించారు.
11:13 April 18
72 గంటల్లో ఒక్క కేసూ లేదు!
కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ఒడిశాకు కాస్త ఉపశమనం కలిగింది. గడిచిన 72 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. గత మూడు రోజుల్లో 1042 శాంపిల్స్‌ను పరీక్షించగా వీరందరికీ కరోనా నెగటివ్‌గా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
భువనేశ్వర్‌లో మరో ఇద్దరు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 21కి పెరిగింది. ఒడిశాలో ప్రస్తుతం 38 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరందరూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
10:57 April 18
గుజరాత్లో 48కి చేరిన కరోనా మృతులు
గుజరాత్లో కొత్తగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 1272కు చేరింది. ఇందులో 88 మంది పూర్తిగా కోలుకోగా.. 48 మంది మరణించారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
10:11 April 18
రాజస్థాన్‌లో 1270కి చేరిన కేసులు
రాజస్థాన్‌లో మహమ్మారి బారినపడి మరో ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్-19 మృతుల సంఖ్య 19కి చేరింది. కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు బయటపడినందున.. మొత్తం కేసుల సంఖ్య 1270కి చేరింది.
08:56 April 18
అగ్రరాజ్యంలో ఉగ్రరూపం
అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఇప్పటివరకు 35 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
2 లక్షల మంది బాధితులు న్యూయార్క్‌లోనే ఉన్నారు. ఆ నగరంలో మృతుల సంఖ్య 14 వేలు దాటింది.
అమెరికాలో ఇప్పటివరకు 37.8 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
08:49 April 18
నౌకా దళంలో కరోనా కలకలం
భారత నౌకాదళంలో కరోనా కలకలం రేపింది. పశ్చిమ నావల్ కమాండ్ పరిధిలో 20 మందికి వైరస్ సోకినట్లు తేలింది. బాధితులంతా ఐఎన్ఎస్ ఆంగ్రేలో పనిచేసే వారని తెలిసింది. వీరంతా నౌకాదళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
08:29 April 18
కరోనా పంజా: 24 గంటల్లో 43 మరణాలు- 991 కేసులు
దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 991 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.