2019 సార్వత్రిక చివరి విడత ఎన్నికలు ఈసీ పటిష్ఠ భద్రత నడుమ ప్రశాంతంగా సాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే వరుస క్రమంలో నిల్చొని.. తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఈ దశలో 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 10.01 కోట్ల మంది ఓటర్లు.. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం లక్షా 12 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
ముఖ్యమంత్రుల ఓటు...
చివరి విడత ప్రారంభమైన కొద్ది సేపటికే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ ముఖ్యమంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ గోరఖ్‌పుర్‌లోని 246వ పోలింగ్ కేంద్రంలో యోగి, పట్నా రాజ్‌భవన్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో నితీశ్ ఓటేశారు.పట్నాలోనే మరో పోలింగ్ కేంద్రంలో బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఓటు వేశారు.