తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సార్వత్రికం' తుది దశలో 64% పోలింగ్

సార్వత్రిక ఎన్నికల రణరంగం ముగిసింది. చివరిదైన ఏడో విడత పోలింగ్​ పూర్తయింది. మొత్తం 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్​ జరిగింది. అక్కడక్కడా ఈవీఎంల సమస్యలు, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

By

Published : May 19, 2019, 5:00 PM IST

Updated : May 19, 2019, 9:32 PM IST

ఓట్ల పండుగ సమాప్తం... ఫలితమే తరువాయి...

2019 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో విడత పోలింగ్ పూర్తయింది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఏడో దశలోనూ కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

తుది దశలో 64శాతం పోలింగ్​ నమోదైంది.

బంగాల్..​ అదే తీరు

బంగాల్​లో ఈ విడతలోనూ ఉద్రిక్తతలు కొనసాగాయి. జాదవ్​పుర్​ లోక్​సభ స్థానంలో భాజపా మండలాధ్యక్షుడిపై తృణమూల్​ కార్యకర్తలు దాడులు చేశారు. బిహార్​, ఉత్తరప్రదేశ్​లోనూ చిన్నచిన్న ఘర్షణలు జరిగాయి.

ఓటు వేసిన ప్రముఖులు

ఈ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్​, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా, దీదీ మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ, భారత క్రికెట్​ మాజీ సారథి సౌరవ్​ గంగూలీ ఓటు వేశారు.

Last Updated : May 19, 2019, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details